ఓ భగవంతుడా…మమ్మల్ని కరుణించు..కచ్చితంగా మేము వెర్రి గొర్రెలమే!

సాక్షాత్తు సీఎం స్థాయి మనిషి అబద్ధాలు నిర్భయంగా PRESS ముందు మాట్లాడితే….
సామాన్యులమైన మనం ఏం చేయగలం ఆ దేవునిపై భారం వేయడం తప్ప.

అబద్ధం నెంబర్ 1:
PRC పై చర్చలు సామరస్యంగా ముగిశాయి.
కాదు…కాదు…కాదు
కాదు… కాదు… మీ జేబులో ఉండే జేఏసీ నాయకులను కొనేసి సానుకూలంగా నడిపించుకున్నారు.

అబద్ధం నెంబర్ 2:
ఉపాధ్యాయ సంఘ నాయకులు తీర్మానాలపై సంతకాలు పెట్టారు.
కాదు…కాదు…కాదు
మీటింగ్ అటెండెన్స్ కు, తీర్మానాలపై చేసిన సంతకాలకు తేడా తెలియక పోవడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం.

అబద్ధం నెంబర్ 3:
ఇది లెఫ్ట్ పార్టీలకు ,పచ్చపార్టీలకు అనుబంధంగా నడుపుతున్న ఉద్యమం.
కాదు…కాదు…కాదు…కాదు
కడుపు కాలిన.. గుండె మండి న… లక్షలాది మంది సామాన్య ఉపాధ్యాయ, ఉద్యోగులు ఈ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యమం మాత్రమే.

అబద్ధం నెంబర్ 4:
కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎవరు పాఠశాలకు వెళ్లలేదు పిల్లలకు చదువు చెప్పలేదు వారిని గాలికొదిలేశారు.
కాదు….కాదు…కాదు…కాదు
కోవిడ్ కాలంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు తెరవక పోయినప్పటికీ.. ప్రభుత్వం మాకు అప్పచెప్పిన అన్ని పనుల్లోనూ మేము భాగస్వాములయ్యాం. ఏ పని చెబితే ఆ పని చేసాం.హాస్పిటల్ ,వైన్ షాప్ ల వద్ద పనితో సహా . అలా చేసే వందలాది మంది ఉపాధ్యాయులను కోల్పోయాం కూడా… అంతేకాదు మాకు అందుబాటులో ఉన్న ప్రతి వనరును ఉపయోగించుకుని అరకొర సౌకర్యాలు ఉన్న రూరల్ ఏరియా లో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాం.

అబద్ధం నెంబర్ 5:
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలను ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నాయి.
కాదు…..కాదు……..
అయ్యో కోవిడ్ కాలం.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మనం మాట్లాడకుండా ఉందాం, అని మౌనంగా మూడేళ్లు భరించాం. రావలసినవన్నీ వదులుకున్నాం. DA arrear బిల్లులు చేసి డబ్బులు రాకుండానే టాక్స్లు కట్టాం….
PRC పేరుతో మా పాత DA బకాయిలన్నీ మింగేద్ధామని మీరిచ్చిన జీవోలను వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసన తెలియజేయడం జరిగింది… దానికి కారణం మీ అర్ధరాత్రి చీకటి జీ.వోలు మాత్రమే.

అబద్ధం నెంబర్ 6:
నిజంగా మీరు మనుషులేనా అని నాకు అనిపిస్తుంది.
కాదు…కాదు…..
మీకే కాదు మాకూ అనిపిస్తుంది మేము మనుషులమేనా అని.
నేను ఉన్నాను అంటే నిజమే అనుకున్నాం.
నేను వస్తున్నాను అంటే తలుపు తెరిచాం.
CPS రద్దు చేస్తాం అంటే సూపర్ అనుకున్నాం.
ప్రభుత్వ ఉద్యోగుల మొహంలో ఆనందం చూస్తానంటే ఆనందపడ్డాం.
కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ల బాధలు తీరుస్తాం అంటే కోటి ఆశలతో ఉన్నాం.
బకాయిలు లేని DA లు ఇస్తానంటే భలే సీఎం అనుకున్నాం.
నిజంగా మీరు చెప్పిన ప్రతి దాన్ని నమ్మాం… మరి మేము మనుషులం ఎలా అవుతాం కచ్చితంగా వెర్రి గొర్రెలమే.

– ఒక సామాన్య ఉపాధ్యాయుడు

Leave a Reply