-కాలనీలలో శ్వాసిత మౌలిక సదుపాయాలు అధిక ప్రాధాన్యత ఇవ్వండి
-గృహ నిర్మాణ శాఖ అధికారులకు మంత్రి పార్థసారధి ఆదేశం
అమరావతి : రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలపై మంగళవారం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో శ్వాసిత మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రహదారులు, మంచినీరు విద్యుత్, డ్రైనేజీ తదితర సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ మోడల్ కాలనీలలో ఏర్పాటు చేయవలసిన మౌలిక సదుపాయాలు కల్పనకు అవసరమైన నిధులు పై వెంటనే నివేదికను తయారు చేయాలని,ఆ నివేదిక ప్రకారం ఈ కాలనీల అభివృద్ధికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకు ప్రయిత్నం చేద్దామని మంత్రి తెలియజేశారు.ప్రస్తుతం ప్రతి లబ్దిదారునికి తక్కువ వడ్డీకి ఇస్తున్న 35 వేల రూపాయలు రుణాన్ని లక్ష రూపాయలకు పెంచేవిధంగా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి ఆదేశించేరు.
లబ్దిదారుకులకు ఇళ్ళ నిర్మాణాలలో ఇసుక,ఇతర సామాగ్రికి ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని మంత్రి సూచించేరు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని,సకాలంలో గృహనిర్మాణాలు పూర్తికాకపోతే భవిష్యత్తులో ఇల్లు మంజూరు కానీ పరిస్థితి ఉన్నందున లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పార్ధ సారధి కోరారు. పిఎంవై-2 పధకం కింద ఇళ్ళు నిర్మించటానికి కేంద్రంతో ఒప్పందం పూర్తీ అయినందున లబ్దిద్దరులను ఎంపిక చేయటానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అధికారులు నిత్యం కాలనీలలో పర్యటిస్తూ ఇళ్ళ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీ పార్థసారథి ఆదేశించేరు.
నాణ్యతకు అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలి
గృహనిర్మాణాలులో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణాలులో ఉపయోగించే ఇసుక సిమెంట్ స్టీల్ తదితర సరుకులలో నాణ్యత ఉండాలని లాబ్ లలో పరిక్షలు నిర్వహించాలని మంత్రి సూచించేరు.పెద్ద కాలనీలలో డ్రోన్లద్వారా నాణ్యతను పరిశిలించాలని మంత్రి సూచించారు.లబ్దిదారులకు నిర్మాణా సామాగ్రి అందుబాటులో ఉంచాలని,నిర్మాణ సామగ్రి దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన అన్నారు.అదేవిధంగా లబ్దిదారులకు సకాలంలో నిధులను విడుదల చేయాలని మంత్రి ఆదేశించేరు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజబాబు రాష్ట్ర రాష్ట్రంలో నిర్మాణాల పురోగతిని మంత్రికి వివరించారు ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ శ్రీ జీవి ప్రసాద్ సూపర్డెంట్ ఇంజనీర్లు నాగభూషణం, జయ రామాచారి తదితర అధికారులు పాల్గొన్నారు