Suryaa.co.in

Andhra Pradesh

సంజయ్ పై సస్పెన్షన్ ను మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు

అమరావతి: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ ను మే 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయనపై సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగించారు. సంజయ్‌పై వచ్చిన అభియోగాలపై ఏర్పాటైన విచారణ కమిటీ సిఫారసులతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాల మేరకు గతేడాది డిసెంబరు 3న సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు.

LEAVE A RESPONSE