Suryaa.co.in

National

ఆస్కార్‌ ఉత్తమ సహాయ నటుడు కీరన్‌ కల్కిన్‌

ఆస్కార్‌-2025 విజేతలు

యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా మొదలైంది. ‘ఎ రియల్‌ పెయిన్‌’ చిత్రంలో నటనకుగానూ కీరన్‌ కైల్‌ కల్కిన్‌ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు.
ఇక ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ‘వికెడ్‌’ చిత్రానికిగానూ పాల్‌ తేజ్‌వెల్‌కు ఆస్కార్‌ రాగా, ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌గా ‘ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌’ ఎంపికైంది.
మరోవైపు 97వ అకాడెమీ అవార్డుల కోసం వైవిధ్యమైన చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్‌ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆస్కార్‌ అవార్డుల కార్యక్రామానికి వచ్చిన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ చిట్‌చాట్‌ చేశారు.

ఆస్కార్‌ విజేతలు వీళ్లే..

ఉత్తమ సహాయ నటుడు – కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్‌ బేకర్‌)
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే – కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌)
యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ – ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌
ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ – ది సబ్‌స్టాన్స్‌

LEAVE A RESPONSE