ఓటీఎస్ పథకం-జగన్ రెడ్డి దోపిడీకి అందివచ్చిన సువర్ణావకాశం

Spread the love

ఓటీఎస్ పథకం పేదలకు గొప్ప అవకాశంకాదు…జగన్ రెడ్డి దోపిడీకి అందివచ్చిన సువర్ణావకాశం
– ఓటీఎస్ స్కీమ్ జగన్, ఆయన సలహాదారుల మేథస్సునుంచి పుట్టిన పేదలపాలిట పెద్ద టోకరా స్కీమ్
– రూ.10వేలకోట్ల రుణమాఫీ అంటున్న జగన్, ముందు హౌసింగ్ కార్పొరేషన్ కు ఉన్న – రూ.16వేలకోట్ల అప్పుతీర్చడానికి, ముందుగా ఆ 10వేలకోట్లను సదరు సంస్థ ఖాతాకు బదలాయించాలి
• ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం) పేదలపైఉన్న రూ.10వేలకోట్లభారాన్ని తొలగించడానికే తీసుకొచ్చామని, బలవంతంలేదంటున్న ముఖ్యమంత్రి మాటలు పూర్తి అవాస్తవాలు
• తాజా సీఏజీ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ ) నివేదిక పరిశీలిస్తే, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన బకాయిలతాలూకా వాస్తవాలు బట్టబయలయ్యాయి
• సీఏజీ నివేదికలోని పేజీ నెం-88లో కేంద్రప్రభుత్వం నుంచి పేదలగృహాలకోసం విడుదలైన రుణాలను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టించిందని చెప్పారు
• అదేపేజీలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, పేదల గృహానిర్మాణం కోసం హడ్కో నుంచి 2019-20 ఆర్థికసంవత్సరంలో తీసుకున్న రూ.1274కోట్ల రుణంలో, రూ.900కోట్లను ఏపీప్రభుత్వానికి బదిలీచేసినట్లు కాగ్ నివేదికలో ఉంది
• సీఏజీ నివేదికలోని పేజీనెం-50లో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సంస్థకు సుమారు రూ.16వేలకోట్లవరకు రుణంఉంటే, దానిలోకేవలం రూ.3700 కోట్లకే ప్రభుత్వగ్యారంటీ ఉందని కూడా కాగ్ నివేదిక చెప్పింది
• మిగిలిన సుమారు రూ.12వేలకోట్ల అప్పుకి సంబంధించి, అప్పులిచ్చిన నాబార్డ్ హడ్కో వంటి సంస్థలు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ని అడిగితే, అవివాటికి తిరిగి చెల్లించకుండా ఈ ప్రభుత్వం ఏంసమాధానంచెబుతుంది?
• పేదలఇళ్లనిర్మాణాలకు సంబంధించి అప్పులిచ్చిన హడ్కో,నాబార్డ్ వంటిసంస్థలకు రేపు తిరిగి అప్పులుచెల్లించకపోతే, ఓటీఎస్ కింద జగన్ ప్రభుత్వం ఇచ్చే రంగుకాగితాలకు విలువఉంటుందా?
• కావున తక్షణమే జగన్ సర్కారు తాముమాఫీ చేశామంటున్న రూ.10వేలకోట్లను హౌసింగ్ కార్పొరేషన్ ఖాతాకు బదలాయించి, తద్వారా దానికున్న అప్పుతీర్చే ప్రయత్నం ముందు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్ ) పథకం గురించి గతనెలరోజులుగా అనేకవార్తలు వింటున్నామని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సదరు నయాబాదుడు పథకం ప్రజలను ఎలా ఠారెత్తిస్తోందో చెప్పాల్సిన పనిలేదని, ఈ పథకం జగన్మోహన్ రెడ్డి, ఆయనఅనుంగు సలహాదారుల మేథస్సునుంచి పుట్టుకొచ్చిన తాజా టోకరా స్కీమ్ అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ జగన్ టోకరా స్కీమ్ అని తెలుగుదేశంపార్టీ మొదటినుంచీ చెబుతోంది. ఎందుకు ఓటీఎస్ ను టోకరా పథకం అంటున్నామంటే, గతకొన్ని దశాబ్దాలుగా వారివారి ఇళ్లల్లో నివసిస్తున్న పేదలవద్దకు వెళ్లి, వారికి పథకాలు అందవంటూ వారినుంచి ముక్కుపిండి వసూలుచేస్తున్నారుకాబట్టి. ఇంతజరుగుతున్నా ముఖ్యమంత్రి, ఓటీఎస్ స్వచ్ఛందంగానే అమలుచేస్తున్నామని, బలవంతంలేదని బుకాయిస్తున్నారు. కానీ వాస్తవం గా మాత్రం అధికారులు, వాలంటీర్లు పేదలమెడపై కత్తిపెట్టి మరీ ఓటీఎస్ వసూళ్లకు పాల్పడు తున్నారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆఖరికి కొందరుతల్లులు వారిబిడ్డల ఆరోగ్యాన్ని బాగుచేయడానికి దాచుకున్న సొమ్మునికూడా ఓటీఎస్ పేరుతో లాక్కునే దుస్థితికి దిగజారారు.
ఉత్తరాంధ్రలో జరిగిన ఘటనను అందరంచూశాముకూడా. కాల్ మనీ వ్యాపారం కంటే దారుణంగా ఓటీఎస్ పేరుతో రాష్ట్రప్రభుత్వమే బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి నిన్నటికి నిన్న పేదలపై పడుతున్న రూ.10వేలకోట్ల భారాన్ని తమప్రభుత్వం తొలగిస్తోందని, పేదలంతా ఓటీఎస్ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పుకొచ్చారు.
ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం) పేదలపైఉన్న రూ.10వేలకోట్లభారాన్ని తొలగించ డానికే తీసుకొచ్చామని, దానిలో బలవంతంలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాల్ మనీ వ్యాపారులకంటే దారుణంగా పేదలనుంచి ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు కాబట్టే, ఓటీఎస్ ను జగన్ టోకరా స్కీమ్ అంటున్నాం. తాజా సీఏజీ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ ) నివేదిక పరిశీలిస్తే, పేదలఇళ్ల తాలూకారుణాలు, రాష్ట్రప్రభుత్వనిర్వాకం తాలూకా వాస్తవాలు బట్టబయలయ్యాయి. సీఏజీ నివేదికలోని పేజీ నెం-88లో (పేరాగ్రాఫ్ 4.7.4.2లో) కేంద్రప్రభుత్వం నుంచి పేదలగృహానిర్మాణంకోసం వివిధపథకాలకు విడుదలైన రుణాలను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టించిందని స్పష్టంగా చెప్పారు.
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, పేదల గృహానిర్మాణం కోసం హడ్కో నుంచి కేవలం 2019-20 ఒక్కఆర్థికసంవత్సరంలో తీసుకున్న రూ.1274కోట్లరుణంలో, రూ.900కోట్లను ఏపీప్రభుత్వంతాలూకా పీడీ అకౌంట్లకు బదిలీచేసి, ఇతర అవసరాలకు వాడుకున్నట్లు కాగ్ నివేదికలో స్పష్టంగాఉంది. ఏపీ స్టేట్

హౌసింగ్ కార్పొరేషన్ సంస్థకు కేంద్రంనుంచి, హడ్కో, నాబార్డ్ వంటివాటినుంచి విడుదలైన నిధులను, ఏపీ ప్రభుత్వం పక్కదారిపట్టించి, ఇతరఅవసరాలకు వాడుకున్నట్లు తేలిపోయింది. సీఏజీ నివేదిక పేజీనెం-50లో వివిధకార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన వివరాలనుకూడా పొందుపరిచారు.
దానిప్రకారం మార్చి2020నాటికి రూ.15,800కోట్లవరకు (దాదాపురూ.16వేలకోట్లు) ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు అప్పులున్నాయని చెప్పింది. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సంస్థకు రూ.16వేలకోట్లవరకు రుణంఉంటే, దానిలోకేవలం రూ.3,700కోట్లకే ప్రభుత్వ గ్యారంటీ ఉందని కూడా కాగ్ నివేదిక చెబుతోంది. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు ఉన్న ఆస్తి ఏదైనా ఉందంటే అదిసదరు సంస్థ పేదలకోసం నిర్మించిన ఇళ్లే. కార్పొరేషన్ కు ఉన్న రూ.16వేలకోట్లఅప్పులో , ఏపీప్రభుత్వం కేవలం రూ.3,700కోట్లకే గ్యారంటీ ఉంటే, మిగిలిన సుమారు రూ.12వేలకోట్లఅప్పుకి ఎవరూ గ్యారంటీలేరు. ఆ 12వేలకోట్లను భవిష్యత్ లో పేదలో లేక ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వారో కట్టాలని, ఇళ్లకు అప్పులిచ్చిన నాబార్డ్, హడ్కో వంటిసంస్థలు అడిగితే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది?
పేదలఇళ్లకు ఓటీఎస్ కింద డబ్బులు కట్టాలంటున్న జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం, ముందుగా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు సీఏజీ లెక్కలద్వారా ఉన్న అప్పులగురించి ఏం సమాధానం చెబుతుంది? భవిష్యత్ లో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఆ అప్పు చెల్లించకపోతే, పేదవాడి ఇళ్లకుఉన్న భద్రతఏంటి? రూ.10వేలకోట్లు రుణమాఫీ చేశామంటున్న ఈ రాష్ట్రముఖ్యమంత్రి, హౌసింగ్ కార్పొరేషన్ అప్పులపై ఏం జవాబు చెబుతాడు? రూ.10వేలకోట్లని గాలిలో మాటలుచెప్పకుండా, తక్షణమే ఆ మొత్తాన్ని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు బదలాయించి, దాని అప్పుతీర్చాలని డిమాండ్ చేస్తున్నాం.
అలా చేయకుండా పేదలఇళ్లపై ఉన్నఅప్పులను ఈ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో ఎలాతొలగిస్తుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. పేదలఇళ్లకు అప్పులిచ్చిన హడ్కో, నాబార్డ్ వంటిసంస్థలు రేపు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ను తమ అప్పులుచెల్లించాలని నిలదీస్తే, ఓటీఎస్ కింద జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే రంగు కాగితాలకు (పత్రాలకు) విలువు ఉంటుందా? కేంద్రంప్రభుత్వం ఇళ్లనిర్మాణానికి ఇచ్చిన నిధులను, కేవలం ఒక ఆర్థికసంవత్సరంలో హడ్కోద్వారా హౌసింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చిన రుణం రూ.900కోట్లను దారిమళ్లించిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఓటీఎస్ పేరుతో పేదలనుంచి ముక్కుపిండి తీసుకుంటున్న వేలకోట్లను తనస్వార్థానికి వాడుకోడని గ్యారంటీ ఉందా?
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు రాష్ట్రప్రభుత్వం ఉన్న బకాయిలపై, ఇళ్లకు వచ్చిరూ.10వేలు ఇవ్వమని అడిగే వారిని ప్రజలు నిలదీయాలి. ముందు ఈ ప్రభుత్వం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు రూ.10వేలకోట్లు జమచేశాకనే, ఓటీఎస్ పథకం గురించి మాట్లాడాలి. అలాకాకుండా పేదలనుంచి ముఖ్యమంత్రి అందినకాడికి వసూలుచేసుకుంటే, రేపు పేదలఇళ్లకు రుణాలిచ్చినబ్యాంకులు, సంస్థలు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ సంస్థమీదకో, పేదలమీదకో వస్తే వారికి దిక్కెవరని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. అలాకాకుండా దోపిడీయే ధ్యేయంగా ఇష్టానుసారంచేస్తున్నారు కాబట్టే, ఓటీఎస్ స్కీమ్ ను జగన్ టోకరా స్కీమ్ అంటున్నాం.
తనదోపిడీకోసం పేదలను వ్యాపార వస్తువుగా మార్చిన, ఈ ముఖ్యమంత్రి ఆఖరికి కాల్ మనీ వ్యాపారికంటే దారుణంగా తయారయ్యాడు. నాసిక్ హైసెక్యూరిటీ ప్రెస్ లో ముద్రింపబడే, నాన్ జ్యుడీషియల్ పేపర్లపై ముఖ్యమంత్రి బొమ్మలు, పార్టీరంగులు ఎలావేస్తారు? అసలు వాటికి ఉన్న విశ్వసనీయత ఏమిటని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎలాగూ మనం అమలుచేస్తున్నది టోకరా స్కీమ్ అని, దానిలో భాగంగా ఇచ్చేవి పనికిరాని కాగితాలే కదా అని, రంగురంగుల్లో ఎలాపడితే అలా మీ తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్ లో ఏమైనా ముద్రించారా? కరెన్సీతో సమానమైన స్టాంప్ పేపర్లపై ముఖ్యమంత్రి బొమ్మ వాటర్ మార్క్ గా ఏవిధంగా వస్తుంది?
జగన్ టోకరా స్కీమ్ మాయలోపడి, ముఖ్యమంత్రి చెప్పేమాయమాటలు నమ్మి, పేదలెవరూ రూపాయికూడా కట్టవద్దని మరోసారివిజ్ఞప్తిచేస్తున్నాం. పేదలుకట్టే ప్రతిరూపాయి దారిమళ్లించడానికి, ముఖ్యమంత్రి దిగమింగడానికేనని కాగ్ నివేదికలో ఉన్న కొన్నిఅంశాల ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు, పేదలకోసంనిర్మించిన ఇళ్లతాలూకా ఉన్న అప్పుఎంత? దానిలో ఎంతమొత్తానికిప్రభుత్వం గ్యారంటీ ఉంది.. ఇంకెంతసొమ్ముని సదరు కార్పొరేషన్ బ్యాంకులు, హడ్కో, నాబార్డ్ వంటి సంస్థలకు కట్టాల్సిఉందనే దానిపై ప్రజలంతా కూడాఆలోచన చేయాలని కోరుతున్నాం.
కాగ్ నివేదికను చదువుకున్నవారు ఎవరైనాచదివితే, ఇప్పుడు తాముచెప్పిన అంశాల్లోని వాస్తవాలు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి వీటన్నింటినీ పరిశీలించాకే జగనన్న టోకరా స్కీమ్ కు రూపాయికూడా చెల్లించవద్దనికోరుతున్నాం. టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై రూపాయి భారం పడకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామని మరోసారి స్పష్టంచేస్తున్నాం. ఇదివరకు ఎన్నిప్రభుత్వాలు వచ్చినా ఏనాడైనా పేదలు ఉంటున్నవారిఇళ్లకోసం వారివద్దకు వెళ్లి డబ్బుకట్టాలని, ఈ విధంగా బెదిరించిన దాఖాలాలు లేవు. ఇప్పటికే ప్రజలంతా పెళ్లిళ్లై కాపురాలుచేశాక, తిరిగిమళ్లీ ఈముఖ్యమంత్రి మాకు పెళ్లిచేసేది ఏమిటంటూ ఓటీఎస్ పథకంపై ఛలోక్తులు విసురుతున్నారు. ఇది పేదలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సదవకాశం కాదు.. ఆయనదోపిడీకి, ఆయనమాత్రమే కల్పించు కున్న సువర్ణావకాశం.

Leave a Reply