ప్రభుత్వం దిగి వచ్చేదాకా మా ఆందోళన ఆపం

2

– ఏపిజెఏసి అమరావతి ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రతి ఉద్యోగి పాల్గొని ఐక్యతను చాటండి.
– బొప్పరాజు – పలిశెట్టి దామోదరరావు

ప్రభుత్వం నుండి ఉద్యోగ,ఉపాధ్య,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సొర్శింగు ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక, ఆర్దికేతర సమస్యల సాధన కోసం,ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం కొనసాగుతున్న ఈ పోరాటం లో ఉద్యోగు సమస్యలు పరిష్కారం పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఈ ఆందోళణా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,జెనరల్ సెక్రటిరీ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

మంగళవారం ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపునిచ్చిన ఆందోళణా కార్యక్రమాలలో బాగంగా జరుగుతున్న నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాలును జయప్రధం చేయాలని ఉద్యోగులవద్దకే వెళ్లి విజ్ఞప్తి చేసేకార్యక్రమంలో బాగంగా డైరెక్టరేట్ ఆఫ్ హెల్తు డిపార్టు మెషటు ఆఫీను,ప్లానింగు డిపార్టుమెంటు హెడ్ ఆఫీసు,కమీషనర్ ఆఫ్ ఎండోమెంటు హెడ్ ఆఫీను, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (ENC)హెడ్ ఆఫీసులలో ప్రతిఉద్యోగిని కలసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను,రావల్సిన కాయిలను,ఉద్యోగులకు సంబందించిన డబ్బులు ప్రభుత్వం వాడు కొని చెల్లించకుండా పెడుతున్న ఇబ్బందులు గుర్చి,పిఆర్శీ బకాయిలు పైన,కొత్త పాత డిఏ బకాయిలు,కొత్త డిఏ చెల్లింపులపై,లీవ్ ఎన్ క్యాష్ మెంటు,మెడికిల్ రిఅంబస్ మెంట్లు రాక పడుతున్న ఇబ్బందులను,సిపియస్/కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్ఛిన హామీ అమలు చేయకపోవడడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఔట్ సోర్సింగు ఉద్యోగుల జీతాలు పెంపు గూర్చి చివరికి మన జీతాలు పెన్సన్లుకూడా ఒకటవతేదీ వేయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న కారణంగా ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకార్యవర్గం నిర్ణయం మేరకు ఉద్యమకార్యచరణను ప్రారంబించామని ఈ ఉద్యమానికి యూనియన్లు/అసోషియేషన్లకు అతీతంగా అందరు మద్దతు పలికి ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని బొప్పరాజు ఉద్యోగులను విజ్ఞప్తి చేసారు.

ఈ ఉద్యమ కార్యాచరణలో బాగంగా ఈ నెలాఖరు వరకు ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో చేపట్టదలచిన marchi- 9వ తేదీ నుండి ఏప్రిల్-5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, తేదిః17 & 20 తేదీల్లో (రెండు రోజులు) ఉద్యమానికి మద్దతుకోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ కార్యాలయాల సందర్శన,ఈనెల 21 నుండి రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉద్యోగులు వర్కుటూరూల్, 27వ తేదీన కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళణా కార్యక్రమాలు గూర్చి ఉద్యోగులకు వివరించి అందరూ స్వచ్చందం గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని బొప్పరాజు & దామోదరరావు విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవగాహన కల్పించటం జరిగింది. అప్పటికి మాన న్యాయమైన ఆర్ధిక, అర్ధికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందించీ పరిష్కరించక పోతే ఏఫ్రిల్ 5 న జరగబోవు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు,పలిశెట్టి దామోదరరావు తో పాటు AP JAC అమరావతి రాష్ట్ర కోశాధికారి వి.వి.మురళీ కృష్టం నాయుడు, కో- చైర్మన్ యస్.మల్లేశ్వరరావు,VRO సంఘ రాష్ట్ర నాయకుడు A సాంబశివ రావు ,NTR జిల్లా చైర్మన్ డి.ఈశ్వర్ ,NTR జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి బత్తిన రామకృష్ణ,RWS రాష్ట్రప్రధానకార్యదర్శి సంతోష్ రెడ్ఢి, ఉమెన్ సెక్రటరీ మెహరాజ్ సుల్తానా, సిటి ప్రెసింటు యం.శ్రీనివాస్ కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్రఅధ్యక్షులు జాన్హెంఢ్రీ, తదితరులు పాల్గొన్నారు.