Suryaa.co.in

Telangana

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవా? సిగ్గు.. సిగ్గు

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై..హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం ? ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ?

గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తోంది..
సంప్రదాయాలను మంటగలుపుతోంది.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.

పార్లమెంట్ లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా ? దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం ? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా ?

LEAVE A RESPONSE