రేవంత్ రెడ్డి కి కారెక్టర్ లేదు
హై కోర్టు నిర్ణయాన్ని స్పీకర్ గౌరవించాలి
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల పై రాష్టానికో నీతి
రేవంత్ తీరుతో పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి
– బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,పాడి కౌశిక్ రెడ్డి
నేను ,ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్ పై హై కోర్టు తీర్పు ఇచ్చింది.పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హై కోర్టు స్పీకర్ కు సూచించింది. స్పీకర్ హై కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల పై రాష్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
హిమాచల్ లో బీజేపీ కి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేశారు. కర్ణాటక లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ లా వ్యవహరించడం లేదు.ఉప ప్రాంతీయ పార్టీ లా వ్యవహరిస్తోంది. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపుల పై ఎందుకు స్పందించడం లేదు?
రేవంత్ రెడ్డి కి కారెక్టర్ లేదు. రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపుల పై చెప్పిన మాటలను గౌరవించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. ఇప్పుడు హై కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలి. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పిరాయించిన పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం.
దానం నాగేందర్ ను హైదరాబాద్ రోడ్ల పై మేమే ఉరికిస్తాం. రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ము తో పది మంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారు. అన్ని వ్యవస్థలు పరస్పరం సహరించుకుని పని చేయాలి. హై కోర్టు చెప్పింది శాసన సభాపతి పాటించాలి.
హై కోర్టు తీర్పు బీ ఆర్ ఎస్ సాధించిన తొలి విజయం. మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. సీఎం ఆయన పై ఏ ఒత్తిడి తేవొద్దు. కాంగ్రెస్ ఫిరాయింపుల పై ద్వంద్వ ప్రమాణాలు వీడాలి. స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.
హై కోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది. అన్ని అసెంబ్లీ లకు ఈ తీర్పు ప్రామాణికం కానుంది. సీఎం రేవంత్ తీరు తో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి.