చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ కోర్టుకు హాజరు

మార్కాపురం: చెక్కు బౌన్స్ కేసు నిమిత్తం సినీ నటులు సుమంత్, ఆయన చెల్లెలు సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. మాచర్లకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు నరుడా డో నరుడా చిత్రానికి నిర్మాత వ్యవరిస్తున్న సుప్రియకు పెట్టుబడి పెట్టారు. ఇందుకు గాను అ చిత్ర హీరో సుమంత్, నిర్మాతగా వున్న ఆయన చెల్లెలు సుప్రియ లు ఇద్దరు జాయింట్ అక్కౌంట్ తో సినిమా ఇన్వెస్టర్ కారుమంచి శ్రీనివాసరావు కు ఇవ్వాల్సిన బాకీ నిమిత్తం చెక్కు ఇవ్వడం జరిగింది….

Read More

కర్మ ఫలం తప్పదు

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు. మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది. పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు. ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా…

Read More

ఓటరు కార్డుతో ఆధార్‌ లింక్‌.. కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు పలు సంస్కరణలకు బుధవారం పచ్చజెండా ఊపింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలతో కూడిన బిల్లుకు బుధవారం ఆమోద ముద్రవేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం…

Read More
Tributes paid to B R Ambedkar

ప్రభుత్వ ఉద్యోగులారా..ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వేసిన కమిటీ, ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ రెడ్డి మాయలో పడి, మర్చిపోయిన కొన్ని అంశాలు కచ్చితంగా ఆలోచన చేయాలి. గతంలో తెలంగాణా కంటే, ఎక్కువగా 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు చంద్రబాబు.ఈ రెండున్నరేళ్ళలో జగన్ రెడ్డి, ఉద్యోగులకు ఏమి చేశాడు?అసలు అప్పట్లో చంద్రబాబు ఏమి చేశారు, ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడో చూసి,…

Read More

జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ

– రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ – రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చిన సీఎం – విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలన్న ముఖ్యమంత్రి – ఐటీ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్న సీఎం – సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ – ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే – విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న ఫ్లిప్‌కార్ట్‌ అమరావతి: ప్రముఖ ఇ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌…

Read More

టీచర్ల బదిలీల వెనుక ఆంతర్యమేమిటి?

– పైరవీలు చేయడానికే ఆఫ్ లైన్ అవకాశమా – బదిలీలు హేతుబద్ధంగా చేపట్టండి -తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క సాధారణ బదిలీలకు నెలల తరబడి టైం ఇచ్చే సర్కారు లక్ష మందికి పైగా టీచర్ల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని పది పదిహేను రోజుల్లోనే పూర్తి చేయాలని తొందర పడటం వెనక ఆంతర్యమేమిటని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్ల బదిలీ లను ఇష్టారాజ్యంగా కాకుండా హేతుబద్ధంగా…

Read More

ఇండియాలో ఏ రాష్ట్రం ఎంత పింఛన్ ఇస్తుందో చూద్దాం

ఏపీలో ఇస్తున్న పెన్షన్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్లు బహు తక్కువ. పెన్షన్లపై నిజానిజాలివి. ఆంధ్రప్రదేశ్ – రూ.2,250 (జనవరి1, 2022 నుంచి రూ.2,500) తెలంగాణ – రూ.2, 016 (మన రాష్ట్రం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. అయినా..మన కంటే తక్కువ పింఛన్ ఇస్తున్నారు) తమిళనాడు – రూ.1000 (మన రాష్ట్రం కంటే ధనిక రాష్ట్రం,…

Read More

కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రులపాలు చేస్తారా?

– మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది – దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి – మరోసారి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎంను కోరుతున్నా – సోము వీర్రాజు ఫైర్ కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన…

Read More

వరంగల్ లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న ఐటి దిగ్గజం జెన్పాక్ట్

తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్పాక్ట్ ప్రతినిధి బృందం మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన సీఈఓ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి జెన్పాక్ట్…

Read More

ఉద్యోగ సంఘాలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన: సజ్జల

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి, సీఎస్‌ ఈరోజు ఆయా సంఘాలతో మరోసారి సమావేశవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఈరోజు ఉండదని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలసి సీఎం జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు ఉద్యోగులకు ఎంత మేర పీఆర్సీ ఇవ్వాలనే దానిపై సీఎంతో చర్చించామన్నారు. ప్రస్తుతం…

Read More