మా పలనాటి యాత్రలో…..

‘ఆత్రేయ సాహితి’ని నాకు రాసిచ్చిన ఆత్మీయులు బ్రహ్మానందంగారు.. గుంటూరులో ఒక ఫంక్షన్ కు ఇద్దరం కలిసి వెళ్ళాం.కొత్తగా కట్టిన ITC వారి హోటల్ లో విడిది చేశాం. కారప్పొడి నంచుకొని కడుపారా మిరపకాయ బజ్జీలు తిని కాఫీలు తాగాం.
దారిలో… పలనాడుసీమను చూస్తూ…
పచ్చి వేరుశెనక్కాయలు తింటూ…
సీమ ఘనతను,గత చరితను గురుతు చేసుకున్నాం.
లలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబులు లేకపోయినా.. మధ్యమధ్యలో తాంబూలాలను కూడా ఆస్వాదించాం.
బెల్లంకొండ రామారాయ కవీంద్రుడు నుంచి బెల్లంకొండ సుబ్బారావు వరకూ
శ్రీనాథుడిని నుంచి కొప్పరపు కవుల వరకూ
తెనాలి రామకృష్ణ నుంచి గుర్రం జాషువా వరకూ
జొన్నన్నం నుంచి గడ్డపెరుగు వరకూ
గోగాకు పచ్చడి నుంచి పచ్చిమిరపకాయ తొక్కు వరకూ
కన్నెగంటి హనుమంతు నుంచి వావిలాల గోపాలకృష్ణయ్య వరకూ
సీ ఎస్ ఆర్ ఆంజనేయులు నుంచి డి వి నరసరాజు వరకూ
కాసు వెంగళరెడ్డి నుంచి కోడెల శివప్రసాద్ వరకూ
చిన్న చిన్న రాళ్లు,చిల్లరదేవుళ్ళ నుంచి గొడ్డుకారం వరకూ అన్నింటినీ మనసారా తలచుకున్నాం.మహనీయులందరినీ మనఃపూర్వకంగా కొలుచుకున్నాం.
‘మా జన్మభూమి’కి మంగళారతులు సమర్పించుకున్నాం.
(ఇద్దరం పలనాడులోనే పుట్టాం. ఆయనది సత్తెనపల్లి -నాది నరసరావుపేట)

-మాశర్మ

Leave a Reply