జిన్నా టవర్ పేరు మార్పు విషయంలో తగ్గేదేలే

Spread the love

– బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ

చంద్రమౌళి నగర్ లోని కార్యాలయంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు నగరం నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్ పై వైసీపీ నాయకులు హడావిడిగా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ పార్టీని మతోన్మాద పార్టీగా రంగుపులమటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు…మహమ్మద్ అలీ జిన్నా పై ఎందుకు మీకు అంత ప్రేమో అర్ధం కావడంలేదు…దేశంకోసం చివరివరకు తన మేధాశక్తిని వినియోగించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టడం నేరమా అని ప్రశ్నించారు.

ఏది ఏమైనా అబ్దుల్ కలాం పేరు పెట్టేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిన్నా టవర్ పేరు మార్పు విషయంలో తగ్గేదే లేదు. మిగతా పార్టీల మాదిరిగా మేము ఓట్ల రాజకీయం చెయ్యము… పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన వారిపై కేసులు లేకుండా చేసిన మీరు మాట్లాడటం కూడా వినాలా అని అన్నారు.మేము నగరంలోని అనేక సమస్యలపై ప్రశ్నించినా స్పందించని మీరు జిన్నా టవర్ విషయంలో మీప్రజా ప్రతినిధులు విలేఖరుల సమావేశం పెట్టి మరీ హడావుడి చేస్తున్న మీరు ఒక మతానికి మద్దతు తెలుపుతూ ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని ప్రశ్నించారు జిన్నాపై మీకు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. ఈవిలేఖరుల సమావేశంలో ప్రధాన కార్యదర్సులు రాచుమల్లు భాస్కర్, కుమార్ గౌడ్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ పాల్గొన్నారు

Leave a Reply