Suryaa.co.in

Andhra Pradesh

నేడు కోర్టులో తాళాలు పగలకొట్టి సాక్ష్యాలు చోరీ.. రేపు వ్యవస్థలకు గోరీ కడతారా?

– నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనలో ఎవరికి లబ్ధికలుగుతుందో అందరూ ఆలోచించాలి పరువునష్టం కేసులో నకిలీ పత్రాలు, తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్థన్ రెడ్డి సోదరి కేసులో ఏ1గా ఉన్నారు. ఆయనే ఇప్పుడు కేబినెట్ మంత్రికూడా. కాబట్టి సాక్ష్యాలు చోరీకి గురైన సంఘటనను న్యాయస్థానం సుమోటాగా విచారించి, అసలు దోషులను శిక్షించాలి
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయవ్యవస్థపై దాడిచేయడం, న్యాయమూర్తులను దూషించడమనేది ఒక అలవాటుగా మారింది
• నెల్లూరు కోర్టులో సాక్ష్యాధారాల చోరీ ఘటన, గతంలో కొలంబియా సుప్రీంకోర్టుపై మాఫియా డాన్ ఫ్యాబ్లో ఎస్కోబార్ దాడిచేసిన ఘటనతో సమానమైంది
• నెల్లూరు ఘటనలో దోషులకు శిక్ష పడకపోతే, భవిష్యత్ లో నేరస్తులు, క్రిమినల్స్, ఇతరత్రా సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడేవారు, కేసులనుంచి, శిక్షలనుంచి తప్పించుకోవడానికి ఏకంగా న్యాయవ్యవస్థపై దాడిచేయడానికి ఎంత మాత్రం వెనుకాడరు
– పీఏసీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

నెల్లూరులోని నాలుగోఅదనపు కోర్టులో రాత్రిచోరీ జరిగిందని, సదరు చోరీలో కీలకమైన డాక్యుమెంట్లు మాయమయ్యాయని నేడుపత్రికల్లోకథనాలువచ్చాయని, కీలకమైన కేసు తాలూకా పత్రాలు తస్కరణకు గురయ్యాయని, కేసుపూర్వాపరాల్లోకి వెళితే, ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి, గతంలో ప్రతిపక్షంలో ఉండి, అప్పుడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నిరాధారఆరోపణలు చేశాడని, లేని అధారాలు ఉన్నట్లు చూపుతూ, నకిలీ సాక్ష్యాలు చూపించాడని, తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సదరు వ్యవహారంపై 2017లో పరువునష్టంకేసువేశారని ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావులకేశవ్ తెలిపారు.శుక్రవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసుపెట్టాక దానిపై ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నకిలీ డాక్యుమెంట్లేనని, అవన్నీ కూడా ఫోర్జరీపత్రా లని తేలింది. సదరు ఘటనలోఇప్పుడుకేబినెట్ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ1 గా ఉంటే, ఇతరులు కొందరుకీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా న్యాయస్థానంలో విచారణలోఉన్న సదరుకేసుకి సంబంధించిన పత్రాలు మాయంకావడం పలుఅనుమానాల కు తావిస్తోంది. అసలు కోర్టులో దొంగలుపడటం ఏమిటి? సాధారణంగా దొంగతనాలు డబ్బుకోసమో, బంగారంకోసమో చేస్తుంటారు. కానీ ఇక్కడ కోర్టులో దొంగలుపడి, కాకాణి ఏ1 గాఉన్న కేసుకుసంబంధించిన పత్రాలు ఏకంగా మాయమయ్యాయంటే ఏమనిభావించాలి.

భారతదేశంలో ఇలాంటిసంఘటన ఎప్పుడూజరగలేదు. న్యాయవ్యవస్థను ప్రభావితంచేసే క్రమంలో ఇదివరకు రకరకాల ఎత్తుగడలు మనంచూశాము. నిందితులు చాలామంది, చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకొని తప్పించుకోవడమో….లేక నాట్ బిఫోర్ మీ అంటూ తప్పించుకోవడమో చేశారు. జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం వచ్చాక చాలావిచిత్రమైన కేసుగా రాజధానికి సంబంధించిన కేసుని చెప్పుకోవాలి. సడన్ గా ప్రభుత్వం కోర్టునుంచి విత్ డ్రా అయితే, అప్పుడు న్యాయస్థానం ఏమని తీర్పు ఇస్తుందనిభావించారు.

అదేస్పూర్తితో ఇప్పుడుఏకంగా న్యాయస్థానంలోని సాక్ష్యాధారాలనే మాయంచేస్తే తప్పించుకోవచ్చని నింది తులు భావించి, ఒకభయంకరమైన ఆలోచనతో ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారనే చెప్పా లి. దీన్ని ఇంతటితో వదిలేస్తే ఈ పోకడ దేశమంతా పాకేప్రమాదం ఉంది. నెల్లూరుకోర్టులో జరిగిన దొంగతనం ఏకంగా దేశన్యాయవ్యవస్థనే ప్రభావితంచేయనుంది. అలానే సాక్ష్యులను కూడా ప్రభావితంచేసే అవకాశాలు మెండుగాఉన్నాయి. సోమిరెడ్డి గారి పరువునష్టంకేసులో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు, ముఖ్యమైన ఆధారాలైనసెల్ ఫోన్లు మాయమయ్యాయి.

నాకు తెలిసి ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా జరగలేదు. ప్రపంచంలో కొలంబియాలోని ఫేబులో ఎస్కోబార్ అనే మాఫియా డాన్ ఉండేవాడు. అతను తన చర్యలతో అమెరికావంటిదేశాన్ని కూడా వణికించాడు. రోజూ వందల కోట్ల ఆదాయం సంపాదించే వ్యక్తి, ఆఖరికి తనపై ఉన్న వివిధరకాల కేసులు చివరి దశకు వచ్చిన తరుణంలో ఏం చేయాలో తెలి యక, ఒక ప్రైవేట్ తిరుగుబాటు సైన్యంతో, ఏకంగా సుప్రీంకోర్టు పై దాడికి తెగబడ్డాడు. ఆఘటన లో కొందరు జడ్జీలు కూడా చనిపోయారు. ఇక్కడ మన రాష్ట్రంలోని నెల్లూరులో జరిగిన సంఘ టన చిన్నది అయితే కావచ్చు కానీ, దేశ న్యాయ వ్యవస్థ కూడా నివ్వెరపోయే ఘటన అనే చెప్పాలి. ఈ ప్రభుత్వ ఉదాసీనత, నిర్లిప్తత కూడా ప్రభుత్వపాత్ర ఉన్నట్టేనని రుజువుచేస్తుంది.

ఆధారాలను ధ్వంసంచేయడం, తస్కరించడం జరిగింది కాబట్టి, సదరుకేసులో ఏ1గా ఉన్నకాకాణితో పాటుఏ2, ఇతరనిందితులపై వెంటనేచర్యలు తీసుకోవాలి. న్యాయస్థానంలో జరిగిన చోరీఘటనపై సుమోటాగా కేసునమోదుచేసి, తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి. సాక్ష్యాలచోరీ వ్యవహారంతోపాటు, పరువునష్టంకేసువిచారణ కూడా కోర్టు పర్యవేక్షణలోనే జరగాలి. ఈఘటనపై న్యాయస్థానం సీరియస్ గా స్పందించకుంటే, ఆధారాలు లేకుండాచేయడం.. దొంగిలించడమనేది నిత్యకృత్యమైపోతుంది.

న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు రక్షణలేకపోతే సమాజమే నాశనమైపోతుంది. ఇప్పటికే ఈప్రభుత్వఅరాచకాలు పతాకస్థాయికిచేరాయి. న్యాయవ్యవస్థపై దాడిచేయడం …ప్రశ్నించినవారిని జైళ్లకుపంపడం వంటి అరాచక విధానాలు పెరిగిపోయాయి. మంత్రిగాఉన్నవ్యక్తి తాలుకా కేసువిచారణ న్యాయస్థానంపరిధిలోజరిగి, నిందితుల కుశిక్షపడితేనే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకంపెరుగుతుంది.

నెల్లూరుచోరీ ఘటనలో ప్రభుత్వ పాత్ర ఎలా ఉంటుందన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా….
ప్రభుత్వ నిర్లిప్తత, ఉదాసీ నత, నిర్లక్ష్యవైఖరి ఈ ఘటనలోకొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చేయాల్సిన పనిచేయకపోవడం అంటే నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఇందులో అందుకే ప్రభుత్వాన్ని దో‎షిగా చూడాలంటున్నాం. ఈఘటనను స్ఫూర్తిగా తీసుకుంటే భవిష్యత్ లో ఏకంగా సుప్రీంకోర్టు పైనే దాడి జరిగినా ఆశ్చర్యం లేదు. నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసుని న్యాయవ్యవస్థ చాలాచాలా సీరియస్ గా తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాము. కాకాణి గోవర్థ న్ రెడ్డి ఏ1గా ఉన్న కేసులో సాక్ష్యాధారాలు మాయంకావడమనేది కేవలం ఒకవ్యక్తి, ఒకపార్టీకి సంబంధించిన అంశంగాచూడకూడదు. సాక్ష్యాలు మాయమైతే ఎవరికి ప్రయోజనమో..వారి పైనే ఎక్కువ దృష్టిపెట్టాలి. అలానే వారికి సహకరించింది ఎవరు…ఎవరి ప్రమేయం.. ఎవరి ప్రోత్సాహంతో జరిగిందనేది తేల్చాలి. పోలీసులు ఇదివరకు చేసిన విచారణ సోమిరెడ్డి గారి పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని… సాక్ష్యాలు అన్నీకూడా ఫోర్జరీ డాక్యుమెంట్లేనని తేల్చ డం జరిగింది. కాబట్టి సదరు సాక్ష్యాలు మాయమైతే ఎవరికి మేలు కలుగుతుందని అందరూ ఆలోచించాలి.

LEAVE A RESPONSE