Suryaa.co.in

Andhra Pradesh

ఒకటవ తేదిన వేతనంలా పింఛన్ ఇస్తున్నారు

-ఎమ్మెల్యే పరిటాల సునీతతో లబ్ధిదారుల ఆనందం
-స్వయంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించిన సునీత
-అర్హులైన అందరికీ పింఛన్లు అందుతాయి.. ఎలాంటి ఆందోళన వద్దన్న సునీత

రాప్తాడు: ఒకటవ తేదిన ఉదయాన్నే తమకు వేతనంలా ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తున్నారని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో లబ్ధిదారులు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామగిరి మండలం నసనకోట పంచాయతీ ముత్యాలంపల్లి గ్రామంలో ఆమె ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయాన్నే గ్రామానికి వెళ్లి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులతో కలిసి ఆమె ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేశారు.

దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ నెల నెలా ఇంటి వద్దకే తెస్తున్నారా అని ఆరా తీశారు. తమకు పింఛన్లు అందుతున్నాయని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒ‍క దేవుడిలా మాకు సాయం చేస్తున్నారని వారన్నారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. మాట ఇచ్చినట్టుగానే వెయ్యి రూపాయలు పెంచి పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందుతాయని.. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలు చూసి పింఛన్లు ఇచ్చారని.. అర్హులైన వారికి పింఛన్లు తొలగించారన్నారు. వాటన్నింటినీ పునరుద్ధరించడంతో పాటు కొత్త కూడా పింఛన్లు అందిస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE