– హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను మోసం
– పీఆర్సీ లేదు.. హెల్త్ కార్డులు లేవు.. 5 డీ ఏ ల జాడే లేదు
– సీపీఎస్ రద్దు పై నాన్చివేత ధోరణి
– కనీసం పండుగల అడ్వాన్స్ కూడా లేదు
– టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది, 3/24 నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు రావడంలేదు, తాము సర్వీసులో దాచుకున్న సొమ్ము తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారు, ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఉద్యోగులను వేధిస్తున్నది. అనేక మంది తమ డబ్బులు రావడం లేదని మానసిక ఒత్తిడి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.
15000 కోట్ల బకాయిలు ప్రతి నెల ఇచ్చిన మాట ప్రకారం చెల్లించినా రెండు ఏళ్లు పడుతుంది. దీనికి తోడు ప్రతి నెల రిటైర్ అయ్యే ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కరలేదు, రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం రిటైర్ ఉద్యోగుల బకాయి తీర్చక పోవడం శోచనీయం. ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పి ఆర్ సి, డి ఏ లు కూడా చేరాయి.
ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి పోతున్న ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలదే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది, పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 5 డీ ఏ ల జాడే లేదు, సీపీఎస్ రద్దు పై నాన్చివేత ధోరణి, కనీసం పండుగల అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా ఉద్యోగులను వేధించడం దుర్మార్గం దీపావళి పండుగ సందర్భంగా డీ ఏ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న.