Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
-వైసీపీని వీడి భారీగా పార్టీలో చేరికలు

చిలకలూరిపేట:ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున వలసలే నిదర్శనమని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి గత కొన్నిరోజులుగా పెద్దఎత్తున విపక్ష తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా పట్టణంలోని పలు వార్డుల నుంచి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పెద్దఎత్తున చేరికలు చోటుచేసు కున్నాయి.

చిలకలూరిపేటకు చెందిన అన్నల దాసు బుల్లిబాబు, ఎన్‌.వి.రత్నారెడ్డి ఆధ్వర్యంలో 300 కుటుంబాలు, ఆటో యూనియన్‌ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 9వ వార్డుకు చెందిన అన్నల దాసు ఫ్రాన్సిస్‌, షేక్‌ బడేమియా, నాగరాజు ఆధ్వర్యంలో 15 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరారు. 18, 25 వార్డులకు చెందిన 20 కుటుంబాల వారు గజేంద్ర ఏడుకొండలు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ కథ ముగుస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని, సాధారణంగా ఎవరైనా విపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరతారు కానీ, ఎన్నికల ముందు ఇంత పెద్దసంఖ్యలో ఇన్ని రోజులుగా విపక్షంలోకి వలసలు కొనసాగుతున్నాయంటే అధికార మార్పిడికి సంకేతమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE