ఇప్పుడే చంద్రబాబుకి ముంపు ప్రాంతాలు గుర్తుకు వచ్చాయా?

– మాజీ మంత్రి పేర్నినాని

వరద బురదలోనూ రాజకీయాలు ఎత్తుకునే వ్యక్తి చంద్రబాబు.వరద ప్రాంతాల్లో పర్యటనలో ఒక్క ఓదార్పు మాటైనా మాట్లాడావా చంద్రబాబు?అధికారం ఇస్తే పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ ఒక జిల్లా చేస్తావా?మరి 2014-19 వరకు అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు చేయలేకపోయావు?ఇప్పుడే చంద్రబాబుకి ముంపు ప్రాంతాలు గుర్తుకు వచ్చాయా? 13 యేళ్లు సీఎంగా, 13 యేళ్లు ప్రతిపక్ష నేతగా 40 యేళ్ల రాజకీయ చరిత్రలో పోలవరం ముంపు ప్రాంతమైన యటపాక ఎప్పుడైనా వెళ్లావా? వరద బాధితుల పట్ల చంద్రబాబువన్నీ ముసలి కన్నీరే. అధికారంలో ఉండగా వారం వారం పోలవరం వెళ్లావ్ కదా అప్పుడైనా యటపాక వెళ్లావా? 1996లోనూ యటపాక వరదకు మునిగిపోయింది కదా..? అప్పుడు సీఎంగా ఎందుకు చంద్రబాబు వెళ్లలేదు?

Leave a Reply