– విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ: సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొనియాడారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాకానీ నగర్ కార్యాలయంలో తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు మహనీయుడు పూలే కృషిచేశారని తెలిపారు.