Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ స్తంభాల అద్దె పెంపుపై హైకోర్టులో పిల్

రాష్ట్రంలో విద్యుత్ స్తంభాల అద్దె పెంచటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.కేబుల్ ఆపరేటర్లకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా అద్దె పెంచారని, విద్యుత్ చట్టం ప్రకారం అద్దె వసూలు చేసే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు లేదని పిటిషనర్ తెలిపారు.

విద్యుత్ స్తంభాల అద్దె పెంచడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.అద్దె పెంపు వల్ల కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని…. సిటీ సిరి డిజిటల్ నెట్‌వర్క్‌ ఎండీ దండమూడి కృష్ణమోహన్‌రావు కోర్టును ఆశ్రయించారు.

మున్సిపల్ కార్పోరేషన్లు , జిల్లా కేంద్రాల్లో ఒక్కో స్తంభానికి నెలకు 100 రూపాయలు , మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో 75 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 50 రూపాయలు అద్దె ఖరారు చేస్తూ…. ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏసీసీపీడీసీఎల్ ఉత్తర్వులిచ్చింది.

కేబుల్ ఆపరేటర్లకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా అద్దె పెంచారని, విద్యుత్ చట్టం ప్రకారం అద్దె వసూలు చేసే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు లేదని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని అద్దె పెంపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

LEAVE A RESPONSE