పితృదేవతలంటే కేవలం తండ్రులు అని అర్థం తీసుకోకూడదు

దేశికచరణస్మరణం

పితృదేవతలంటే కేవలం “తండ్రులు” అని అర్థం తీసుకోకూడదు. పితృదేవతలకు నమస్కారం అని అంటే కేవలం శరీరం విడిచిన తండ్రి, తాతలేకాదు అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలా వీరుకూడా పితృదేవతలలోకే వస్తారు… అంతే తప్ప పితృ అని పేరుందికాబట్టి కేవలం శరీరం విడిచిన తండ్రి తాతలన్న అర్థం కాదు.

సంధ్యావందనంలో కానీ నిత్యవిధులలోకానీ పితృభ్యోనమః అంటే శరీరంతో ఉన్న తల్లిదండ్రుల కొరకు ఆ నమస్కారం అని కాదు అర్థం. శరీరంతో ఉన్న తల్లిదండ్రులకు నిత్యం చేసేది చేయవలసినది తిన్నగా పాదాభివందనమే, ఏ మంత్రమూ అవసరంలేదు.

సంధ్యావందనం, నిత్య నైమిత్తిక కర్మల్లో చేసే నమస్కార తర్పణాదులు దివ్య పితృదేవతలకు, శరీరంతో లేని మాతా పితరులకు ఆ పరంపరలో ఉన్న పైవారికి. రక్త సంబంధం బంధుత్వం, ఆత్మ బంధుత్వం ఏర్పడిన పితృలోకంలో ఉండే గణాలని గౌరవించడం పితృదేవతా నమస్కారం.

ఊర్థ్వలోకాల్లో అంటే ద్యులోకంలో ఉండే పితృ దేవతలు ఏడు గణాల సమూహం అందులో మూడుగణాలకి ఆకారమే ఉండదు.. ఇక లింగబేధమేమిటీ?.. అక్కడకూడా పితృస్వామ్యం అదీ ఇదీ వంటి ప్రశ్నలు ఉత్పన్నమవడమే అసంబద్ధం.

Leave a Reply