Suryaa.co.in

Andhra Pradesh

స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు నాటండి

– బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర

విజయవాడ: నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల దగ్గర గాని, వీధుల్లో గాని అమ్మ పేరుతో మొక్కను నాటండి అని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన “మా కే నామ్ పే ఏక్ పెడ్” (అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం) శుక్రవారం మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కృష్ణనగర్ పార్కు ప్రాంగణం వద్ద మొక్కలు నాటారు.

ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర విచ్చేసి, మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని రేపటి భవిష్యత్తు తరాలకి స్వచ్ఛమైన గాలి అందజేయటానికి ఈ బృహత్తర కార్యక్రమం తోడ్పడుతుందన్నారు.

“వృక్షో రక్షిత రక్షితః” ఏ మొక్కల్ని అయితే ఈరోజు మనం పాతుతున్నామో అవి వృక్షాలుగా మారి రేపటి తరానికి అమోఘమైన ఫలాలను, ఆరోగ్యమైన జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నానన్నారు. ఇలా మొక్కల్ని పాతటం వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

మహిళా మోర్చా ఉపాధ్యక్షులు వాణి వెంకట్, జిల్లా కన్వీనర్ సుకన్య, కోలా రేణుకాదేవి, జిల్లా కార్యదర్శి సరోజినీ, మహిళామోర్చా ఉపాధ్యక్షులు మహాలక్ష్మి, సభ్యులు మణి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ గూడూరు రాంబాబు, పబ్లిసిటీ అండ్ లిటరేచర్ రాష్ట్ర కన్వీనర్ పాలపాటి రవికుమార్, బిజెపి 2వ మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, తిరుపతిరావు, బిజెపి రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పద్మనాభం, రాయుడు, పొన్నపల్లి సోమశేఖర్, మైలవరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE