– బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు అక్రమం
– ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు నమోదైన కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది.
– దీనికి విరుద్ధంగా కౌశిక్ రెడ్డిని ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీసు స్టేషన్లో నిర్బంధించారు
– ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు, మానవహక్కుల వేదిక దృష్టికి తీసుకెళతాం
– కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని అడగడానికి వెళ్లిన హరీశ్ రావు ని కూడా అరెస్టు చేస్తారా?
– గచ్చిబౌలి పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
గచ్చిబౌలి: ఇదేమంటే ముందస్తుగా అరెస్టు చేశామని పోలీసులు చెబుతారు. ఏవైనా అల్ల కల్లోలాలు జరుగుతున్నయా, ఘర్షణలు అవుతున్నయా? చట్టాన్ని ఇష్టారీతిన వాడుకునే వారెవరైనా మేం వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను కోర్టులో చట్టబద్దంగా ఎదుర్కొంటాం. ఇప్పటికైనా అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలందరినీ వదిలివేయాలి.
పోలీసుశాఖ డీజీపీ చేతిలో లేదు: ప్రవీణ్ కుమార్
ఇవాళ తెలంగాణలో పోలీసుశాఖ డీజీపీ చేతిలో లేదు.
ముఖ్యమంత్రి, వారి కుటుంబం పోలీసుశాఖను చేతుల్లో పెట్టుకున్నది.
గాంధీ భవన్లో స్రిప్టు రాసిచ్చిన ప్రకారంగానే పోలీసులు కేసులు పెడుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు దీనికి నిదర్శనం.
నేను కూడా పోలీసుశాఖలోనే 26 ఏళ్లు సర్వీసులో ఉన్నా. కానీ, ఇంత పక్షపాత వైఖరి ఏనాడూ చూడలేదు. ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యేకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నదని ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసు అధికారులు పారిపోయారు. పైగా ఆ ఎమ్మెల్యేపైనే అక్రమంగా కేసు పెట్టారు. అరెస్టు ఎందుకు చేశారో తెలుసుకుందామని వెళితే హరీశ్ రావుపై కేసు పెట్టారు.
ఇలా కేటీఆర్ పై 6 కేసులు, హరీశ్ రావుపై 5 కేసులు అక్రమంగా పెట్టారు.
పార్క్ లో వాకింగ్ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి 25 రోజులుగా జైల్లోనే ఉంచారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరుల పేర్లతో లేఖ రాసి ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కేసు ఉండదు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం ప్రజాపాలనో తెలంగాణ ప్రజలే ఆలోచించాలె. సరైన సమయంలో బుద్ధి చెప్పాలె.