కేసీఆర్ అవినీతి ఇప్పుడు తెలిసిందా?

– అమిత్‌షాపై పొన్నాల ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై తాను ఎప్పుడో చెప్పానని, ఏడున్నరేళ్ల తర్వాత అమిత్‌షా అవినీతి అమిత్‌షాకు గుర్తు రావడం విచిత్రంగా ఉందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ అవినీతి తెలిసినప్పుడు ఆయనపై చర్య ఎందుకు తీసుకోవడం లేదు? అంటే ఇద్దరి మధ్య తెరచాటు స్నేహం ఉందని స్పష్టమవుతోంది. అది తెలియని అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు’ అని వ్యాఖ్యానించారు.

పొన్నాల ఏమన్నారంటే… కేసీఆర్ అవినీతి మోడీ దృష్టికి వచ్చింది అని చెప్పడం , 7 1/2 సంవత్సరాల తర్వాత తెలిసిందా ? దొంగల తోనైనా దోస్తీ – అధికారం కోసమే కదా బీజేపీ తెరాస నాటకాలు?పరిపాలన ప్రజల కోసం కాదు , తమ సంపాదన , అధికారం కోసం మాత్రమే.

కేసీఆర్ అవినీతి గురించి ఏ ఎన్నికల్లోనూ BJP ఎందుకు ప్రస్తావన తేలేదు ? 2014 ఏప్రిల్ 14వ లోనే కెసిఆర్ అవినీతిపై ( ఎన్నికల ముందే ) నేను మాట్లాడాను.. ఏడున్నర సంవత్సరాల తర్వాత బిజెపికి హోమ్ మినిస్టర్ అమిత్ షా కి కేసీఆర్ అవినీతి గురించి సమాచారం నా నోటీస్ లో ఉంది అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా..?

కేంద్ర ప్రభుత్వానికి నోటీసు లో ఉందని చెప్పడమా..? అధికారం కోసం టిఆర్ఎస్ బిజెపి నాటకాలు ఆడుతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2014 నుండి మేము Kcr గురించి చెబుతా ఉంటే ఇప్పుడు అనడం సిగ్గుచేటు కాదా? అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడిన వారిపై బిజెపి టిఆర్ఎస్ రెండు కలిపి డ్రామాలు ఆడుతున్నాయి..

మా పార్టీ నిన్నమొన్న వచ్చిన పార్టీ కాదు. మేము అధికారం కోసం ఆరోపణలు చేసే వాళ్ళం కాదు. ఏప్రిల్ 14 2014 కంటే ముందు సిబిఐ స్పెషల్ కోర్టు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పింది వాస్తవం కాదా?
ఈడి , సహారా , దొంగ పాస్పోర్ట్ కేసులు సిబిఐ కోర్‌టు దృష్టికి వస్తే , సిబిఐ ఎస్పీని చార్జిషీట్ ఫైల్ చేయమంటే చేశారా? కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను నిర్దోషినని నిరూపించుకోవలసిన బాధ్యత లేదా?

పొత్తుల కోసం అమిత్ షా ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షా కళ్ళు తెరిచినట్లు నటిస్తున్నాడు ఎందుకంటే పొత్తుల కోసం.పరిపాలన కొనసాగాలి అధికారం తన దగ్గర ఉండాలి.

కెసిర్‌ అవినీతి చిట్టా మచ్చుకు
పవర్ ప్లాంట్స్ యాదాద్రి కానీ భద్రాద్రి కానీ 4000, 1200 మెగా వాట్ లు..
దాదాపు 50 వేల కోట్లు తెలంగాణ వచ్చిన మరుక్షణం, కరెంటు కోసం అంటూ అవినీతికి పాల్పడిన కార్యక్రమం లేదా.. అప్పుల పాలు చేశారు కదా ?
800 మెగావాట్లు minimum capacity ఉండాలి అని కేంద్ర విద్యుత్ సంస్థలు చెప్పిన నేపథ్యంలో, పాతవాటిని ( 270 MW ) తీసుకొచ్చాడు . అవైనా పూర్తయ్యాయా ?
యాదాద్రి దగ్గర నీళ్లు లేవు , బొగ్గు లేదు , నాలుగు వేల మెగా వాట్స్.. దీనికి కారణం ఏంటి ? దోపిడి కోణం కాదా .? ఇది రుజువు చేస్తాం అంటే సీబీఐకి ఇచ్చారా?
పవర్ పర్చేస్ లో అవినీతి ఉంది ఒక్క కాళేశ్వరం లోనే కాదు.. చర్చకు రాడు కదా ?
ప్రాణహిత-చేవెళ్ల ఎక్కడ ? కాలేశ్వరం ఎక్కడ..?

2016 వరకూ ప్రాణహిత-చేవెళ్ల కు జాతీయ హోదా కావాలన్న KCR , ఏ విధంగా కాళేశ్వరం తీసుకున్నాడు ?..
పాలమూరు-రంగారెడ్డి ఎక్కడ అయ్యా కేసీఆర్? ఎన్ని వేల కోట్లు అయ్యాయి ? దీనిలో వివాదం సృష్టించావు కదా ? అదేమైనా ముందుకు వచ్చిందా?
పాలమూరు-రంగారెడ్డి లో అవినీతి జరిగింది.
నీ అంతట నీవు ఎందుకు సిబిఐతో ఎంక్వైరీ చేయించడం లేదు కేసీఆర్?
మిషన్ కాకతీయ తో చెరువులు బాగు చేయించానని చెప్పడం సిగ్గుచేటు.
35 వేల కోట్లు ఖర్చు పెట్టి.. చెరువులు బాగు చేయించానని చెబుతున్నారు దీని ద్వారా అదనంగా 7 టిఎంసిలు కు మించు రాలేదని 70 వేల ఎకరాలకంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వలేరని ప్రభుత్వ గణాంకాలు చెబుతుంటే సిగ్గులేదా కేసీఆర్?
దీనిలో అవినీతి జరగలేదని ఎందుకు ఎంక్వైరీ చేయించవు?
మిషన్ భగీరథ అని ఇంటింటికి భగీరథ నీళ్లు అని ఎన్నికల ముందు ఎందుకు అనలేదు కేసీఆర్ ?
మంచినీళ్లు లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారా ? పేజ్ వన్ , పేజ్ టు, పేజ్ 3 ద్వారా కృష్ణ నీళ్లు తీసుకురా లేదా..?
50 వేల కోట్ల లో అవినీతి ఉందని మేము ఆనాడే చెప్పాం . ఈనాడు చెబుతున్నాం . ఇప్పటివరకు ఎంక్వైరీ లేదు.హరిత హారంలో వేల కోట్ల అవినీతి జరిగింది.అసైన్డ్ భూములు మీ బంధువుల ఆదీనంలో ఉన్నది వాస్తవం కాదా కెసిఆర్.
నయీమ్ కేస్ ఏమైంది? నయీమ్ కేస్ పైన చర్చకు వస్తారా?
ఇబ్రహీంపట్నం కూకట్పల్లి అయ్యప్ప సొసైటీ భూములపై చర్చకు వస్తారా..?
కెసిఆర్ ఆస్తులు 2014 ముందు ఇప్పుడు ఎంత ఉన్నాయి ? ఇన్ని ఆస్తులు ఏవిధంగా సంపాదించారు?
మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా?
మీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు అధికారులపైన ఎన్ని వందల కేసులు ఉన్నాయో చర్చకు వస్తారా? ఎంక్వయిరీ వేస్తారా?
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ఎంక్వయిరీ చేస్తే దోపిడీ ఎంత ఉందో తెలుస్తుంది.
ముఖ్యమంత్రిగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ED డిపార్ట్మెంట్ , ముఖ్యమంత్రిని విచారించ లేదా?
ఈడి విచారించింది అంటే ఇది గోప్యంగా ఉంచే దా.?
టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఏదైనా దోపిడీ కోణం గానే ఉంది.

Leave a Reply