Suryaa.co.in

Telangana

ప్రకాష్‌రాజ్ ప్రయాగరాజ్ స్నానం ఉత్తిదేనట!

– ఖండించిన ఫ్యాక్ట్ చెక్

హైదరాబాద్: ప్రముఖు సినీ నటుడు ప్రకాష్‌రాజ్ ఇటీవల కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో స్నానం చేశారంటూ సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు ఉత్తిదేనట. ఆ మేరకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో అదే సోషల్‌మీడియాలో ఒక పోస్టు విడుదలయింది. హిందుత్వాన్ని వ్యతిరేకించే సెక్యులరిస్టు అయిన ప్రకాష్‌రాజ్, ప్రయాగరాజ్‌కు వెళ్లి స్నానం ఎలా చేశారంటూ నెటిజన్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దానితో రంగంలోకి దిగిన ఫ్యాక్ట్‌చెక్.. అదంతా ఉత్తిదేనని, దానికి కారకులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ వార్తలో పేర్కొంది. సో.. ప్రకాష్‌రాజ్ ప్రయాగరాజ్‌లో స్నానం చేయలేదన్నమాట. బహుశా అది ఏఐతో రూపొందించిన చిత్రంగానీ, లేదా ఏదైనా సినిమా సన్నివేశానికి సంబంధించినది గానీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

LEAVE A RESPONSE