– రైతులకు ఉచితంగా పంటల యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంట కొనుగోలు సమాచారం
– యాప్ ను ఆవిష్కరించిన ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ప్రవీణ్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా పంటల యాజమాన్య పద్ధతులు, సూచనలు, భూసార పరీక్షలు, ఎరువుల యాజమాన్యం, సాంకేతిక పరిజ్ఞానం, పంట కొనుగోలు సమాచారం ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ప్రతిమ గ్రూప్ ప్రత్యేకంగా యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతిమ గ్రూప్ రూపొందించిన ఇ-రైతు యాప్ ను ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. వీ. ప్రవీణ్ రావు తన చాంబర్ లో బుధవారం ఆవిష్కరించారు.రైతుల కోసం ప్రత్యేకంగా ఇ-రైతు యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చి, రైతులకు ఉచితంగా అన్ని రకాల సూచనలు, సలహాలు ఇవ్వనుండటం గొప్ప విషయం అని ప్రొ. ప్రవీణ్ రావు అన్నారు.
ఇ-రైతు యాప్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని రైతులు అన్ని రకాల సూచనలు, సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చని ప్రతిమ గ్రూప్ ఇ-రైతు డైరెక్టర్లు బోయినపల్లి ప్రణయ్, డా. అనుజ్ కొల్లి తెలిపారు. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో ఉన్న తమ బ్రాంచీల ద్వారా రైతులకు సహకారాన్ని అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇ-రైతు సిఇఓ రమణారావు వర్దినేని, టీమ్ సభ్యులు పాతూరి ప్రవీణ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.