అంతర్జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ జట్టుకు ప్రవలిక ఎంపిక

-కొరియాలో జరగనున్న పోటీలు
– అభినందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : కొరియాలో ఏప్రిల్ రెండో తేది నుంచి జరిగే ఆసియా కప్ మహిళా సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటిలకు సికింద్రాబాద్ లోని సీతాఫలమండి కి చెందిన చేపుర్వ ప్రవలిక ఎంపికైంది. భారత్ దేశ జట్టులో స్థానం సాధించిన ఆమెను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సికింద్రాబాద్ లోని తన నివాసంలో అభినందించారు.

ఔత్సాహిక క్రీడా కారులను తెలంగాణా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తన వ్యక్తిగతంగా కూడా సికింద్రాబాద్ నుంచి వివిధ క్రీడాంశాల్లో పాల్గొనే వారిని ప్రోత్సహిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొరియాలో పోటీల్లో పాల్గొనే భారత జాతీయ జట్టుకు తెలంగాణా రాష్ట్రం పక్షాన ఏకైక క్రిడాకారిని ప్రవలిక మహారాష్ట్ర లోని యావత్ మాల్ లో ఇండియన్ కోచింగ్ శిబిరంలో పాల్గొనేందుకు తరలి వెళ్లనుంది. కొరియా లో ఆసియా కప్ లో మన జట్టు రాణించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.