పీ.ఆర్.సీగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్

259

ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) గా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు స్వీకరించే ముందుగా అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తరువాత ఢిల్లీ లోని ఏ.పీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం
praveen ఏ.పీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఏ.పీ భవన్ పీ.ఆర్.సీ గా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం మాజీ పీ.ఆర్.సీ అభయ త్రిపాఠి గారికి మరణానంతరం నివాళులు అర్పిస్తూ అధికారులు, సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.