గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు లభించాలని ప్రార్థించారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.