– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా సాగిందని టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ విద్యాశాఖ లోకేష్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అభినందించడం విశేషమన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యం స్వర్ణాంధ్రతోనే సాధ్యమని ప్రధానమంత్రి అభివర్ణించారు. గూగుల్ రాకతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తుందని ప్రకటించారు. ఆత్మనిర్బార్ భారత్ కు సరికొత్త శక్తిగా ఏపీ ఆవిర్భవించిందన్నారు. ఏపీలో వివిధ ప్రాజెక్టులను 13429 కోట్లతో చేపట్టిన ఆయా పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుందని మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ యువత శక్తి, చైతన్యం భారత దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఉత్సవ్ జయప్రదం పై ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉత్సాహాన్ని కొనియాడారు. అక్కడ ఢిల్లీ ఇక్కడ అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయని అభివర్ణించడం ఆనందంగా ఉందన్నారు.