హుజూర్ నగర్ లో కొవ్వొత్తులతో నిరసన

Spread the love

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హుజూర్నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకుల అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు , తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్కే అలీ , st సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ వెంకట్ రామ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు నేలపట్ల అంజయ్య గౌడ్, కీసరి నాగయ్య , ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మీసాల సైదులు , తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చల్లా వంశీ , తెలుగు యువత నాయకులు మధు చౌదరి , వల్లపు దాసు కోటయ్య, పెండెం అంజయ్య గౌడ్ , బీసీ సెల్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ తారక్ , ఓర్సు వెంకన్న, పివాల్ రాజు , ఎల్లావుల ఉపేందర్ యాదవ్ జింకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply