– ఎంపీ కు కృతజ్ఞతలు తెలిపిన మామిడి రైతులు
విజయవాడ: మైలవరం నియోజకవర్గం రెడ్డి గూడెం మండలం రెడ్డిగుంట మామిడి రైతులు ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసి ప్రూట్ కవర్స్ 50 శాతం సబ్సిడీతో లభించేలా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం రెడ్డి గూడెం రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్.పి.సి) డైరెక్టర్లు చేబ్రోలు శ్రీనివాసరావు, చేబ్రోలు రాజు ఆధ్వర్యంలో మామిడి రైతులు ఎంపీని కలిశారు.
ఎమ్.ఐ.డి.హెచ్ స్కీమ్ కింద 800 హెక్టార్లకు, ఒక్కో హెక్టార్ కు పదివేల చొప్పున ప్రూట్ కవర్స్ 50 శాతం సబ్సిడీతో అందుకున్నట్టు ఎంపీ కేశినేని శివనాథ్ కు వివరించారు. ప్రూట్ కవర్స్ తొడిగిన మామిడికాయలను ఎంపీ కు చూపించి వాటి నాణ్యత వివరించారు. నాణ్యత గల మామిడిలను పండిస్తున్నందుకు మామిడి రైతుల తరుఫున ఎఫ్.పి.సి డైరెక్టర్ చేబ్రోలు శ్రీనివాసరావు ను ఎంపీ శాలువాతో సత్కరించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యుల అభివృద్ధికి ఎప్పుడు అండగా వుంటానని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్.పి.సి డైరెక్టర్ చేబ్రోలు కృపారాజు, మామిడి రైతులు చేబ్రోలు రాజు, చేబ్రోలు సాంబశివరావు, నాగ ప్రసాద్, హార్టికల్చరల్ అధికారి నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.