– వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గార, శ్రీకాకుళం రూరల్ మండల ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రజా గ్రీవెన్స్ బుధవారం నిర్వహించారు. ప్రజా దర్బార్ లో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ కోసం, గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మాణానికి అధికంగా అర్జీలు వస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు. గ్రామాల్లో మంచినీరు, పారిశుద్ద్యం, విద్యుత్తు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గార మండల టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.