Suryaa.co.in

Andhra Pradesh

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై పురంధేశ్వరి దిగ్భ్రాంతి

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడటం వల్ల ఏడు మంది దుర్మరణం చెందడం పట్ల పురంధేశ్వరి ఆవేదనను వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. జీడిపిక్కల లోడుతో వెళుతున్న లారీ అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం కు గురైనట్టు సమాచారం. ఈ సందర్భంలో, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని, వారికి తగిన సహాయాన్ని అందించాలని పురంధేశ్వరి కోరారు.

LEAVE A RESPONSE