Home Telangana మీ ముందు చూపులేని తనంతో రాష్టాని అంధకారంలో నెట్టారు

మీ ముందు చూపులేని తనంతో రాష్టాని అంధకారంలో నెట్టారు

● తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
దేశంలో బొగ్గు నిల్వలు తగ్గిపోతుండటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం భారతదేశం అంధకారంలోకి వెళ్లిపోయే విపత్మర పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని మీడియా ఒకవైపు హెచ్చరిస్తుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రులు విద్యుత్‌ సంక్షోభం రాదని అనడం విడ్డూరం.
2 రోజులలో ఢిల్లీ అంధకారం అవుతుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పొరపాట్ల వల్ల మన రాష్టం కూడా ఇబ్బందిపడే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నోవేల హెక్టార్ల సాగు పెరిగిందన్నారు. కానీ ఈ ప్రాజెక్టు కింద ఉన్నవన్నీ ఎత్తిపోతల ప్రాజెక్టులే వీటికి విద్యుత్‌ అవసరం


ఉంటుంది. భారతదేశం చూపంతా సింగరేణి బొగ్గు గనులపైనే ఉన్నది. దీనిని కేంద్రం అధీనంలోకి తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నడపాలో ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరమున్నది.
శ్రీశైలం హైడ్రోపవర్‌ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ పెడుతున్న చిక్కులను రాష్ట్ర ప్రభుత్వం అధిగమించడానికి ముఖ్యమంత్రి జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించి విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరమున్నది. ముందుచెప్పకుండా విద్యుత్‌ కోతలు విధించడం ప్రారంభమైందని అంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలసమయాలను ముందుగానే పత్రికా ప్రకటనల ద్వారా ప్రభుత్వం ప్రజలకు తెలపాలి.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేవిధంగా చేశారు. యువత తాగుడుకు బానిసలవుతున్నారు. లక్ష బెల్ట్‌షాపులను రాష్ట్రంలో నడుపుతున్నారు. ఇటీవల చైత్ర అనే పాప చనిపోవడానికి కారణమేమిటి? తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు,అఘాయిత్యాలు, మద్యం, మత్తు పదార్థాలు వాడడం వల్లనే జరుగుతున్నాయి.
మాదకద్రవ్యాల తయారీ, సరఫరా, వాడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. హైవే రోడ్‌లపై కంట్రోల్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ వంటి నగరంలో గంజాయి తదితర మత్తు పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నారు,వాడుతున్నారు. ఏదోతూతూ మంత్రంగా విచారణ జరిపించి వదిలివేయడం గర్జనీయం.మత్తుపదార్థాలను వాడుతున్నవారిని శిక్షించే దమ్ము ప్రభుత్వానికి లేదా? షీటీమ్‌ల సంఖ్యను పెంచాలి.
నిన్న రాత్రి బీజేపీ పార్టీకి చెందిన నాయకుల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లలో తుడవడానికి తెలుగుదేశం పార్టీ జెండాలను ఉపయోగించడం దారుణం. తెలుగుదేశం పార్టీ జెండా మాకు పవిత్రమైనది. ఇలాంటి మా పార్టీ జెండా అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

NO COMMENTS