– నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిగేది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలోనే
– లూజ్ లిక్కర్ అమ్మకాలు జరిగే చోట “క్యూఆర్ కోడ్” తో పనేంటి?
– కంటి తుడుపు చర్యగానే బాటిళ్లపై “క్యూఆర్ కోడ్” ప్రింటింగ్
– ఇన్నాళ్లు నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిపామని అంగీకరించినట్టే
– గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైయస్సార్సీపీ పరిశీలకులు పోతిన మహేష్
తాడేపల్లి: నకిలీ లిక్కర్ దందాపై కూటమి ప్రభుత్వంపై మద్యపాన ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చర్యగానే బాటిళ్లపై “క్యూఆర్ కోడ్” ప్రింటింగ్ పెడుతోందని, అంటే ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించడమే అవుతుందని వైయస్సార్సీపీ నాయకులు పోతిన మహేష్ ఆరోపించారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నకిలీ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగేది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల లోనే కాబట్టి నకిలీ మద్యం దోపిడీకి “క్యూఆర్ కోడ్” అడ్డమే కాదని, లూజ్ లిక్కర్ అమ్మకాలు జరిగే అలాంటిచోట “క్యూఆర్ కోడ్” తో పనేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ..
నకిలీ మద్యం తాగే చాలా మంది రోజువారీ కూలీ చేసుకుని జీవించేవారు. వారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. చదువులేని వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కూడా తెలియదు. అలాంటప్పుడు మద్యం బాటిళ్లలో ఇచ్చే వాటిలో నకిలీ ఏది, ఒరిజినల్ సరుకు ఏది అనేది ఎలా తెలుస్తుంది?
పర్మిట్ రూమ్‌లలో లూజ్ లిక్కర్ అమ్ముతుంటే వారు తాగేది నకిలీ లిక్కరో, ఒరిజినల్ దో మద్యపాన ప్రియులు ఎలా తెలుసుకుంటారు? అలా తెలుసుకునే అవకాశం లేనప్పుడు ప్రభుత్వం క్యూర్ కోడ్ ప్రవేశపెట్టి ప్రయోజనం ఏంటి? బెల్ట్ షాపుల్లో క్యూఆర్ కోడ్లు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం?
యస్సార్‌సీపీ హయాంలో మద్యపాన ప్రియుల కోసం గొంతుచించుకున్న పవన్ కళ్యాణ్, నేడు కూటమి పాలనలో రాష్ట్రంలో భారీ ఎత్తున నకిలీ మద్యం మాఫియా వెలుగుచూసినా నోరెత్తడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదంటే ఆయన దీనికి మద్దతిస్తున్నా? అక్రమాలపై ప్రశ్నిస్తాను అన్న పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?