జీవన నాణ్యత

జీవితం: జీవితం అనుభూతుల మయం. సుఖ దుఃఖాల నిలయం . ఎత్తుపల్లాల ప్రయాణం మానవ జీవితం. ఇదో అనుభూతుల మరియు అనుభవాల పరం పరం.
కవులు,తత్వవేత్తలు మరియు మానసిక శాస్త్రవేత్తలు వారి వారి అధ్యాయన మరియు అనుభూతుల మేరకు జీవితాన్ని నిర్వహించారు.కానీ జీవితానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వటం అంత సులభం కాదేమో!
మనం ఏడుస్తూ భూమి పైకి వస్తాం,ఏడిపిస్తూ భూలోకము నుంచి నిష్క్రమిస్తాము. ఈ రెండు ఏడ్పుల మధ్య నవ్వుతూ నవ్వించడమే జీవితంగా భావిస్తాం. జీవితాన్ని నవ్వులపాలు చేయక నవ్వుతూ నవ్వించే ప్రయత్నం చేస్తాం.

జీవితమంటే జీవించటం
Life is to live
జీవితమంటే ప్రేమించటం
Life is to Love
జీవితమంటే నడిపించటం
Life is to lead
జీవితం అంటే నేర్చుకోవడం
Life is to learn
జీవితమంటే వారసత్వాన్ని విడిచిపెట్టడం
Life is to leave Legacy.
అని ప్రేరేపించే నిర్వచనాలు చూసి ఆనందిస్తాం.

జీవితమంటే ? జీవించటం కొరకు అనేది నిర్వివాద సత్యం. అయితే ఎలా జీవించాలి? అనేది ఈ ఆధునిక కాలంలో ప్రశ్నార్ధకం .దాని నుంచి ఉద్భవించేదే జీవిత నాణ్యతా ప్రమాణాల సూత్రం.

నాణ్యత
ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకీ ఓ నాణ్యతా ప్రమాణం ఉంటుంది .నాణ్యతా ప్రమాణాలు చూడనిదే మనిషి ఏ వస్తువునూ కూడా కొనుగోలు చేయడు. కానీ తన మనసుకీ కూడా ఒక నాణ్యతా ప్రమాణం ఉంటుందని మర్చిపోతూ ఉంటాడు. “The Quality of the Mind is Mentality”.
ఐక్యరాజ్యసమితి జీవన నాణ్యతని ఆర్థిక మరియు సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించడం జరిగింది . కానీ మనిషి సౌఖ్యాలు,సుఖాన్ని శాంతి కలిగించని ఈ తరుణంలో జీవిత నాణ్యతని (Quality of Life) ని మానసిక శాస్త్ర దృక్పథంలో (Psychological Perspective) చూడవలసినటు వంటి అవసరం ఆసన్నమైనది.

సమగ్ర వికాసము
మనిషి శరీరంలో అవయవాలు అన్నీ సమగ్రంగా పెరిగితే ఆకారం వస్తుంది. శరీర సౌష్టతా ఉంటుంది . ఏదైనా ఒకే అవయవము పెరుగుతూ పోతుంటే ఆకారానికి బదులుగా శారీరక వికారం కలుగుతుంది .
అలానే మనిషి జీవితంలో ఆరోగ్యము , ఐశ్వర్యము,సామాజిక బంధాలు, జ్ఞానము మరియు నైపుణ్యత సమగ్రంగా పెరిగినట్లయితే జీవితం యొక్క నాణ్యత కూడా పెంపొందుతుంది.

నాణ్యతా కారకాలు ( Quality Enhancers):
*Attentive Actions
*Accurate Attitude
*Benevolent Behaviour
*Empathetic Emotions
*Perfect Perceptions
*Sharp Senses
* Transformative thoughts
are the some of the enhancers of Quality of Life.

జీవిత నాణ్యతా నిరోధకాలు : (Inhibitors)
మనిషి యొక్క మనసునీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింప చేసే దాంట్లో మొదటిది నోటి మాట .
ఉన్నది లేనట్లు గానూ! లేనిది ఉన్నట్లుగానూ! కపట మాటలను ప్రదర్శించటం ఆధునిక కాలంలో మనిషి తన నైపుణ్యతగా భావిస్తూ ఉంటాడు. చూసింది చూడనట్లు, చూడంది చూసినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.ఇటువంటి ప్రవర్తనవలి మానసిక ఘర్షణకి గురి చేయడమే కాకుండా జీవన నాణ్యతని తగ్గిస్తుంది.

మరిన్ని కారకాలు
* వ్యాయామ లోపం
* పౌష్టికాహార లోపం
*దీర్ఘకాలిక రోగాలు
*అతిగా మద్యపాన సేవనం
* బద్ధకం మరియు అతినిద్ర
*జీవితంపై ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం
* “నేను “నా వంశం” మా కులం వంటి డాంబికాలు ప్రదర్శించటం
* ధన తాపత్రయము లాంటి కొన్ని విషయాలు మనిషి జీవిత నాణ్యతని హరించి తన ఉద్యోగానికి, తన ఆర్ధిక స్థితికి, తన వ్యాపార ఉన్నతికి, సరితూగే ఆనందమయ జీవితం కాకుండ సగటు జీవితం లేక హీన జీవితాన్ని గడిపే ప్రమాదానికి నెట్టు వేయబడ్డాడు.

సాంఘిక బంధాలతో పట్టు కోల్పోయి ఒంటరి మరియు అపరాధ భావం సంతరించుకుంటుంది. కలివిడితనం పూర్తిగా కొరవడుతుంది.
మనిషి మనసు సాంఘికరించ బడిననాడు (Human mind Should be Socialised)
మానవత్వం పొందిననాడు ( Humanized) తద్వారా స్వీయ వాస్తవికత (Self Actualization )ప్రాప్తించిన నాడు మనిషి యొక్క జీవన నాణ్యత ప్రమాణాలకు అర్థము పరమార్థము ఏర్పడుతుంది.
మానసిక మరియు శారీరక శక్తులను అనుప్రయుక్తముంచేసి జీవితం ఆనందమయం చేయబడుతుంది.
జీవిత నాణ్యతా ప్రమా ణం పెంపొందించ బడుతున్నాయి.

తన ఉద్యోగం, హోదా, ఆర్థిక ఉన్నతికి తగ్గట్టుగానే మానసిక పరిపక్వత కూడా ఉంటుంది.
“లేదంటే సంపాదించేవి సౌధాలు అనుభవించేవి మనో పేదరికలు”మానసిక దౌర్బల్యలు.

– డాక్టర్ జి. రాజేశ్వరరావు
సైకాలజిస్ట్
ఆక్స్ఫర్డ్ స్కూల్, పాతపట్నం