ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు

-వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజలకు నష్టమంటూ ముఖ్యమంత్రి కొత్తభాష్యాలు చెబుతున్నారు
-ప్రజలముందుకు వెళ్లే ధైర్యంలేకనే ముఖ్యమంత్రి, అసెంబ్లీలో గానభజానా నిర్వహించుకుంటూ తన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నాడు.
• విపత్తులసహాయార్థం కేంద్రప్రభుత్వమిచ్చిన రూ.324కోట్ల నిధులను ఈ ముఖ్యమంత్రి దారిమళ్లించాడు. ఆ నిధులే ఉంటే, ఇప్పుడు వరదబాధితులకు ఉపయోగపడేవికదా!
• ప్రతిపక్షనేతలను వేధించడం, వరదబాధితులకు సహాయంచేస్తున్నవారిపై పోలీసుజులుం ఉపయోగించడం వంటివికాకుండా, ఈముఖ్యమంత్రి ఇప్పటికైనా మానవత్వంతో వరదప్రాంతాల్లో పర్యటిస్తే మంచిది
• అంతా అయిపోయాక తాపీగావెళితే, ముఖ్యమంత్రి కంటపడేవి శవాలదిబ్బలు, శ్మశానాలే
-టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
శాసనసభలో వరదబాధితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో ఒక వితండ వాదన కనిపించిందని, ఆయన ఎన్నడూలేని విధంగా కొత్తవాదనలు చేయడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తనున్నాయని ఎప్పుడో 18వతేదీనే హెచ్చరికలు వచ్చి నా, అధికారయంత్రాంగాన్ని అప్రమత్తంచేయడంలో, ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించ డంలో ఈ ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని, టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ఆగ్రహంవ్యక్తంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని తెలిసీ ఈ ముఖ్యమంత్రి తాపీగా, పెళ్లిళ్లకోసం అంటూ హైదరాబాద్ వెళ్లాడు. అక్కడబిర్యానీలు తింటూ, కేసీఆర్ తో ఖుర్బానీ మీటింగ్ లు జరిపాడు. ఏ రకంగా చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని దూషించాలంటూ మంతనాలు జరిపాడు. అసెంబ్లీలో చంద్రబాబుని దూషించడం ఎలాగా.. తిరిగి ఆమాటలను అసెంబ్లీ రికార్డుల్లో లేకుండా ఎలాచేయాలనే దానిపైన, రాజకీయాలకోసం తనప్రత్యర్థుల్ని ఏరకంగా మానసికం గా వేధించి పైశాచిక ఆనందం పొందుదామనే దిశగానే దృష్టిపెట్టాడు తప్ప, ప్రజలను వరదల బారినపడకుండా ఎలాకాపాడాలనే దానిపై ఆలోచనచేయలేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే సంకుచిత మనస్తత్వం ఈ ముఖ్యమంత్రిది.
వరదలు, విపత్తులువచ్చినప్పుడు చంద్రబాబునాయుడు గారు ఏరకంగా ప్రజల్లోఒకడిగాఉండి, వారిని రక్షించడానికి ప్రయత్నిం చారో ఈముఖ్యమంత్రి ఒకసారి తెలుసుకుంటే మంచిది. హుద్ హుద్ వచ్చినప్పుడు చంద్ర బాబుగారు పదిరోజులు విశాఖలోనే ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి చెప్పిందినిజమే.. అసలే సర్వస్వంకోల్పోయిన ప్రజలమధ్యలోకి వెళ్లాలంటే ఈయనకు వేలమందిపోలీసులు కావాలి. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లడానికే వందల మంది పోలీసులను అడ్డుపెట్టుకొని పరదాలచాటున వెళతాడుకదా? దానికితోడు వరదబాధితులవద్దకు వెళితే,వారికి తక్షణసాయంగా ఏదైనా చెయ్యడానికి ఈ ముఖ్యమంత్రి వద్దడబ్బులు లేవుకదా? ఆసలే ఇప్పటికే రాష్ట్రఖజానా ఒట్టి పోయింది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయినవారికి కోటిరూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి,వరదల్లో చనిపోయిన వారికి మాత్రం ముష్టి రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించాడు.
వరదల్లో చనిపోతేఒకఖరీదు, పరిశ్రమల్లో చనిపోతే మరో ఖరీదు కడతారా ముఖ్యమంత్రి గారు? ఒక పూజారి కుటుబం మొత్తం వరదల్లో కొట్టుకుపోయింది. కనీసం ఆ కుటుంబంలో బతికున్నవారితో ఫోన్లో కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. నీరోచక్రవర్తి కంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి మరో నీరోచక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడుగానీ, చంద్రబాబులా బాధితులవద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. చంద్రబాబు అధికారంలో లేకపోయినా, భాద్యతగల ప్రతిపక్షనేతగా ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారిని కాపాడటానికి పూనుకున్నారు. ప్రజలకు కష్టమొచ్చినప్పుడు, వరదల్ని, వర్షాలను, వయస్సుని లెక్కచేయకుండా చంద్రబాబునాయుడు ఎలా పనిచేశారో ఈ ముఖ్యమంత్రి, తనకుతెలియనట్టే నటిస్తున్నాడు. సభలోకూర్చొని నవ్వుకుంటూ దుర్యోధనుడిలా ప్రవర్తించాడు తప్ప, ప్రజలగురించి జగన్ ఆలోచించలేదు. వరదల్లో తమవారిని కోల్పోయిన మహిళలు భోరునవిలపిస్తున్నారు. వారి వేదన, రోదన అంతా ముగిశాక అప్పుడు తాపీగా ముఖ్యమంత్రి గారు వరదప్రాంతాలకు వెళతారట.
జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి వరదలువచ్చినప్పడు ఖమ్మంజిల్లాకు వెళ్లారు. అలానే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలు కష్టాల్లోఉన్నప్పుడే వారివద్దకు వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగాప్రతిపక్షనేతలను వెంటబెట్టుకొని వరదప్రాంతాల్లో పర్యటించి బాధితుల కు అండగా నిలిచారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాడు. హృదయం ఉన్నవారు ఎవరైనా ప్రజలకు కష్టమొచ్చినప్పుడు వారికోసం ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి కొత్తచట్టమా..పాతచట్టమా.. మూడు రాజధానులా.. ఆరురాజధానులా అన్నవాటిపైనే మనసంతా ఉంది. ఈ ముఖ్యమంత్రి ఆఖరికి కేంద్రప్రభుత్వమిచ్చిన విపత్తు నివారణనిధులు రూ..324కోట్లను దారిమళ్లించాడు. ఆ నిధులే ఉంటే , ఇప్పుడు వరదబాధితులకు ఉపయోగపడేవికదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పనికిమాలిన ప్రజాప్రతినిధులు అనరాని మాటలన్నా కూడా ఆ మహాతల్లి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరదబాధితులకు అండగా నిలిచింది. ట్రస్ట్ సిబ్బంది రేయింబవళ్లు ఇంటింటికీతిరుగుతూ, బాధితులకు ఆహారం, మంచినీళ్లు, దుప్పట్లవంటివి పంపిణీచేస్తున్నారు. ఆ విధంగా బాధితులకు అందే సాయాన్నికూడా ఈముఖ్యమంత్రి పోలీసులసాయంతో అడ్డుకుంటున్నాడు.
ముఖ్యమంత్రి బయటకు రావాలంటే పోలీసులు కావాలి.. వరదప్రాంతాల్లో పర్యటించాలంటే పోలీసులు కావాలి. ఆఖరికి ప్రతిపక్షం, స్వచ్చంద సంస్థలు వరదబాధితులకు చేస్తున్న సాయాన్ని అడ్డుకోవడానికి కూడా ఈ ముఖ్యమంత్రి సిగ్గులేకుండా పోలీసులనే నమ్ముకున్నాడు. వరదబాధితురాలైన ముస్లింమహిళ అయేషా తమకు న్యాయంచేయమని చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ప్రశ్నిస్తే, ఆమెను పోలీసులతో కొట్టిస్తారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకంత అహంకారం? రాజంపేట, నెల్లూరు, కడపలో మంత్రులను వరదబాధితులు తరుముకున్నారు. పరిశ్రమల్లో చనిపోయేవారి ప్రాణాలకుఒకలా.. వరదల్లో పోయినవారి ప్రాణాలకు ఒకలా ఖరీదుకట్టే ముఖ్యమంత్రిని ఇప్పుడేచూస్తున్నాం. పింఛా ప్రాజెక్ట్ నుంచి అన్నమయ్యప్రాజెక్ట్ కు వరదరావడానికి మూడుగంటలు పడుతుంది. ఆసమయంలో ప్రాజెక్ట్ దిగువనఉన్నవారిని తరలించడం ఈప్రభుత్వానికి, యంత్రాంగానికి చేతగాలేదు.
అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంద్వారా ఈప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించి వందలమందిని బలితీసుకుంది. వరదరాకముందే దిగువప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిఉంటే, నేడు వందలాదికుటుంబాలు నీళ్లపాలయ్యేవి కాదుగా! వాతావరణంలో సంభవించే మార్పులను, ఉపద్రవాలను ముందే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబునాయుడు తీసుకొస్తే, దాన్నికూడా ఈప్రభుత్వం పక్కనపెట్టేసింది. చంద్రబాబునాయుడు మంచికోసం చేసే వాటినికూడా ఉపయోగించుకోలేకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటుకాదా? అసలు డిజాస్టర్ మేనేజ్ మెంట్ అనే మాటకు అర్థమేంటో ఈ ప్రభుత్వానికి తెలుసునా? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈముఖ్యమంత్రి వరదప్రాంతాలకు వెళ్లడంలేదని చెప్పుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఊరికే గాల్లోతిరిగేసి, అసెంబ్లీకివచ్చి, తనపార్టీ వారితో గానాభజానా చేయించుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి పనితీరు ఇప్పటికే ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఆఖరికి రాయలసీమవాసులే ఇలాంటివ్యక్తిని మనంనమ్మి ఓట్లేశామని వాపోతున్నారు.
గండికోట రిజర్వాయర్ ముంపు ప్రాంతబాధితులకు ప్రభుత్వం ఎలాంటి ముందుజాగ్రత్తలు చెప్పకపోవడంతో, వారుసర్వస్వం కోల్పోయారు. ఇదివరకు కడపజిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు, ఎలాంటి సహాయం చేయలేకపోయానని సదరు బాధితులను ఈ ముఖ్యమంత్రి క్షమాపణకోరాడు. ఉత్తుత్తి క్షమాపణలతో సరిపెట్టాడుతప్ప, ఇప్పటికీ గండికోట రిజర్వాయర్ బాధితులకు రూపాయిఇవ్వలేదు. మందబలంఉంది కదా అని అసెంబ్లీలో భజన చేయించుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆడవాళ్లను దూషిస్తున్న మీ మంత్రులు, ఎమ్మెల్యేలనుచూసి పొరుగురాష్ట్రాలవారు నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంతాఅయిపోయాక ముఖ్యమంత్రి వరదప్రాంతాలకువెళితే ఆయనకంటపడేది శవాలదిబ్బలే.
వరదల్లో ఇళ్లుకోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లుకట్టించి ఇవ్వాలని, తమవారిని కోల్పోయిదిక్కులేకుండా కట్టుబట్టలతో మిగిలినవారి కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వరదల్లో చిక్కుకున్న ప్రతికుటుంబానికి రూ.లక్షపరిహారంఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా గానాభజానాలు ఆపేసి, ప్రతిపక్షాలపై వేధింపులు ఆపేసి, బాధితులవద్దకు వెళితే మంచిది. నవీన్ పట్నాయక్ తనకు ఆదర్శమంటూ ఈ ముఖ్యమంత్రిచెప్పడం హాస్యాస్పదం. నవీన్ పట్నాయక్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ముఖ్యమంత్రి గారు. ఆయనేమీ మీకులాగా రాజధాని లేకుండా తనరాష్ట్రాన్ని పాలించడంలేదు. నవీన్ పట్నాయక్ ఒక్కడే ఈముఖ్యమంత్రికి ఆదర్శమా..? వరదల్లో ప్రజలకోసం తిరిగిన జగన్ రాజగురువు కేసీఆర్ తనకు ఆదర్శం కాదా? ఏంచేసినా, ఎవరు ఎలాపోయినా డబ్బులిస్తే చాలు తనకు ఓట్లేస్తారన్నధీమాతో ముఖ్యమంత్రి ఉన్నారు. అధికారం ఉందికదా అని జగన్మోహన్ రెడ్డిప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు… ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు వారు ఈ ముఖ్యమంత్రికి పట్టపగలే చుక్కలుచూపించఢం ఖాయం.