రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉందా? పోలీస్ రాజ్యం ఉందా?

-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

దేశం లో ,రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా 2వేళా మంది పోలీసులను భద్రతగా పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉందా?? పోలీస్ రాజ్యం ఉందా? జగన్ కు పిచ్చి పరాకాష్టకు చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ పద్ధతిని మార్చుకోవాలి. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. వైసిపి ప్లీనరీ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు,మంత్రులు లలో ఒక్కరైనా స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రైతులు కోసం మాట్లాడారా.

జగన్మోహన్ రెడ్డి భజన కోసం వైసీపీ ప్లీనరీ పెట్టుకున్నారు. సీఎం జగన్ 22 సార్లు ఢిల్లీ వెళ్లి ఎం సాధించారు. సీఎం జగన్ మూడేళ్ళలో రాష్ట్రంలో ఎం అభివృద్ధి చేశారో చెప్పాలి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం ద్వారా సీఎం జగన్ ఆరు వేల కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ప్రధాని మోదీ చంద్రబాబు తో చేతులు కలిపితే నాలుగు రోజులు పేపర్ లో ప్రచురించుకున్నారు. రాష్ట్ర పరువు ప్రతిష్ఠలు అధికార,ప్రతిపక్ష పార్టీలు మంటకలుపుతున్నాయి.