Suryaa.co.in

Andhra Pradesh

హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నిక

హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నిక
వైసీపీవి విలువలు లేని రాజకీయాలు
– నందమూరి బాలకృష్ణ

హిందూపురం : మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన టిడి రమేష్ కి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ, పార్థసారథి మాట్లాడారు. హిందూపురంలో కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి 13 మంది కౌన్సిలర్లు వాళ్ల వార్డులో అభివృద్ధి కోసం టీడీపీలోకి చేరారు. వాళ్లు పార్టీ మారిన రోజు పార్టీ నుండి సస్పెండ్ చేసి సోమవారం కొత్తగా కౌన్సిలర్లకు విప్ జారీ చేయడం అర్థరహితమని అన్నారు. విలువలు లేని రాజకీయాలు చేశారు కాబట్టి 151 సీట్లు వచ్చినా అయిదేళ్ళలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు.

కేవలం 11 సీట్లు వచ్చాయంటే మీ నిరంకుశ పాలన కి ప్రజలు చరమగీతం పాడారని, ఇప్పటికైనా ప్రజల కోసం రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని వారు వైసీపీకి హితవు పలికారు. అనంతరం గెలిచిన మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు, పార్లమెంట్ సభ్యులకు ఘన సత్కారం జరిగింది.

LEAVE A RESPONSE