రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు..

రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు.
కొట్లాటలు,పోట్లాటలు, కుమ్ములాటలు, దొమ్మీలు అంతకన్నా కాదు.
ఏ ప్రాంతానికి లేనంత గొప్ప చరిత్ర ఉంది!!.
ఎంతో వైభవం ఉంది. మరెంతో వైభోగం పొందింది!!.

మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం)
లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి.
అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు!!.
కుందాచార్యుడు (కొనకొండ్ల – గుంతకల్లు -అనంత పురం.
తరిగొండ వెంగమాంబ (1730 -1817 తరిగొండలో చిత్తూరు జిల్లా) 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కందిమల్లాయపల్లి, కడప!!. 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి. హేతువాది. సంఘ సంస్కర్త.
వేమన (సుమారు 1652-1730 మధ్యకాలం- కడప జిల్లా.
మొల్ల (1440 -1530 –గోపవరం-కడప) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
గజ్జెల మల్లారెడ్డి (1925 ఆంకాళమ్మ గూడూరు- కడప) ఈయన ఒక అభ్యుదయ, వ్యంగ్య కవి.
గువ్వల చెన్నడు (17-18 శతా బ్దాల శతక కవి) కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో శతకాన్ని రచించాడు!!.
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990 చియ్యేడు-అనంత పురం) తెలుగు పదాల తో ‘‘శివ తాండవం’’ ఆడించిన కవి.
తరిమెల నాగిరెడ్డి (1917-1976 తరిమెల గ్రామం-అనంతపురం)
B.N రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి 1908-1977) జన్మస్థలం కొత్తపల్లి- పులి వెందుల, కడప జిల్లా!!. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.
బి నాగిరెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912-2004 విజయ ప్రొడక్షన్స్ ) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి.
కె.వి.రెడ్డి (జూలై 1, 1912 – 1972 అనంతపురం జిల్లా తాడిపత్రి) కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభా వంతుడైన దర్శకుడు,నిర్మాత మరియు రచయిత!!.
టీ.జి. కమలాదేవి (1930 – 2012 కార్వేటి నగరం చిత్తూరు) ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి
జిక్కి (1938-2004 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం)
నీలం సంజీవరెడ్డి (1913-1996, ఇల్లూరు గ్రామం అనంతపురం) భారత రాష్ట్రపతి
దామోదరం సంజీవయ్య (1921–1972 కల్లూరు కర్నూలు) మొదటి దళిత ముఖ్యమంత్రి
మునెయ్య (కడప జిల్లా- దొమ్మర నంద్యాల గ్రామం) ఈయన ప్రముఖ జానపద గాయకుడు.
జిడ్డు కృష్ణమూర్తి (1895-1986 మదనపల్లె చిత్తూరు జిల్లా)
బళ్ళారి రాఘవ (1880-1946 తాడిపత్రి అనంతపురం జిల్లా)
శంకరంబాడి సుందరాచారి (1914-1977 తిరుపతి చిత్తూరు జిల్లా)
C.R Reddy (1880-1951 కట్టమంచి చిత్తూరు)
కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభా వంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శ వాది, రాజ నీతిజ్ఞుడు!.
గడియారం వేంకట శేషశాస్త్రి (1894 పెదముడియం కడప)
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువు నా రగుల్చుతూ రచించిన మహా కావ్యమే ‘శ్రీ శివభారతం’.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి (1926-2014 రాయదుర్గం అనంతపురం)
తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత..!!
మధురాంతకం రాజారాం (1930-1999 మొగరాల గ్రామం చిత్తూరు జిల్లా)
బుడ్డా వెంగళ రెడ్డి- ఉయ్యాలవాడ,
కర్నూలు జిల్లా. 185 గ్రామాల ప్రజలకు గంజి పోసి బ్రతికించాడు. బ్రిటిష్ రాణి చే మన్నన పొందిన దానశీలి.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (జననం 18 శతాబ్దం తొలినాళ్ళ లో-మరణం-1847 జన్మస్థానం రూపనగుడి కర్నూలు జిల్లా)
సురభి నాటకం. బాల తిమ్మయ్య గారి పల్లి(సురభి గ్రామం)- చక్రాయపేట (మం).- కడప జిల్లా.
రాయలసీమ అంటే ఇది!!.
తిరుపతి వేంకట కవులు
పద్మనాభం
పసుపులేటి కన్నాంబ
చిత్తూరు నాగయ్య
పోలుదాసు(వెళ్లాల) శాంతకుమారి ప్రొద్దుటూరు- కడప జిల్లా.

కలియుగ వైకుంఠం- తిరుమల
ఆంధ్ర అయోధ్య-ఒంటిమిట్ట
కృతయుగప్రాశస్త్యం- అహోబిలం
తొలి విష్ణు దేవాలయం- నందలూరు
తొలి విద్యాకేంద్రం-పుష్పగిరి
కదిరి లక్ష్మీ నృసింహుడు
గండి వీరాంజనేయుడు
లేపాక్షి
భక్త కన్నప్ప- ఊటుకూరు- రాజంపేట-
అన్నమయ్య జిల్లా.

రాయలసీమ అంటే
10 పది సుమోలు
వెనక100 మంది ఫాక్షనిస్టులువాళ్ళ చేతుల్లో ఉండే వేట కొడవళ్ళు
నలువైపులా విసిరేసే నాటు బాంబులు
కాదు. కాదు. కానే కాదు.

తలెత్తి సగర్వంగా చాటి చెప్పండి. ఇది మా గడ్డ.

– రవికుమార్