Suryaa.co.in

Andhra Pradesh

జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నా

– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: రాష్ట్రం కోసం జైలు కెళ్లడానికి, దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైకాపాను వీడిన ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు గురువారం మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు..రమేశ్‌బాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

”వాలంటీర్లపై మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఒక సారి మాట చెబితే అన్ని రిస్క్‌లు తీసుకునే చెబుతా. నన్ను అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైన సిద్ధంగా ఉన్నా. మీరు ప్రాసిక్యూషన్‌ అంటే నేను సిద్ధంగానే ఉన్నా.

న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తాయి. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం. మీరు చేసే పనులు కోర్టులు కూడా చూస్తున్నాయి. ఒక్కో వాలంటీరుకు ఇచ్చే రోజు వేతనం 164 రూపాయలు. డిగ్రీ చదివిన వారికి ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారు.

LEAVE A RESPONSE