కర్నూల్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో పత్తి ధర

కర్నూలు : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పత్తి ధర పలుకుతుంది. గరిష్టంగా క్వింటాలు పత్తి ధర రూ. 10,899 ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఏ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇంత ధర పలకలేదని అధికారులు చెబుతున్నారు. పత్తి సీజన్ ముగింపుకు చేరుకోవడం, దిగుబడి విక్రయానికి రావడం తగ్గడం వలన పత్తి ధరలు అమాంతంగా పెరిగడానికి ప్రధాన కారణమని మార్కెట్ అధికారులు చెప్తున్నారు.