సొంత చెల్లిని రోడ్ల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడు

Spread the love

• సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డిని చంపినవారిని జగన్మోహన్ రెడ్డి కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పింది
• వివేకాకుమార్తె సునీత తనతండ్రిని చంపినవారికి శిక్షపడేలా చేయమని జగన్మోహన్ రెడ్డిని, ఆయనభార్యభారతిని కన్నీటితో వేడుకున్నా వారి మనసు కరగలేదు
• సునీత అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్యజరిగితే, ఆనాడు టీడీ పీప్రభుత్వం అధికారంలో ఉండటంతో జరిగినదారుణాన్ని నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి, ఆయనసాక్షి మీడియా చంద్రబాబు కి అంటగట్టాలనిచూసిందని, ఆనాడు తనచిన్నాన్న హత్యపై సీబీఐ విచారణకోరిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక హత్యకేసువిచారణపై అనేక పిల్లి మొగ్గలు వేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఎద్దేవాచేశారు.ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయ్ హత్యకేసుని సీబీఐ విచారణ కు అప్పగించాలంటూ హైకోర్ట్ కి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్య మంత్రి కాగానే ఆ పిటిషన్ ను ఎందుకు వెనక్కుతీసుకున్నాడు? వివేకాకుమార్తె సునీత హైకోర్ట్ నిఆశ్రయించి, తనతండ్రి హత్యపై సీబీఐ విచారణజరిగేలా చేయడంతో, వివేకాహత్యకేసు విచారణ సీబీఐచేతిల్లోకి వెళ్లింది. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచా రణ మొదలైనప్పటినుంచీ, అసలు మాజీమంత్రిని చంపించింది ఎవరనేదానిపై రోజురోజుకి ప్రజలకు అర్థమవుతూ వచ్చింది.

వివేకా హత్యకేసుని విచారిస్తున్న సీబీఐ అధికారులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు కేసులుపెడుతున్నారంటే, చివరకు పరి స్థితి ఎంతవరకువచ్చిందో అందరూ ఆలోచించాలి. నేడు వివేకానం దరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తనతండ్రి హత్యకేసులో కీలకనింది తుడైన ఎంపీ అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నేరుగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా గారికి లేఖ రాశారు.

ఆ లేఖలో ఆమె తాను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జతచేర్చారు. వివే కాహత్యలో అవినాశ్ రెడ్డి పాత్రఉందని సునీత నేరుగానే చెప్పారు. ఆమె చెప్పిన అంశమేకాకుండా, ఇప్పటికే సీబీఐ విచారించిన ప్ర త్యక్షసాక్షులంతాకూడా వివేకాహత్యలో అవినాశ్ రెడ్డి ప్రమేయా న్ని, పాత్రను ధృవపరిచారు. సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం లో తనతండ్రిని చంపిన అవినాశ్ రెడ్డిపై చర్యలుతీసుకోవాలని నేరు గా జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్యభారతిని కోరడం జరిగిందని చెప్పారు.

అలాకోరినప్పుడు వారు అవినాశ్ రెడ్డిపై కేసులపెడితే ఏమవుతుందని, సీబీఐ విచారణజరిపిస్తే, అతను బీజేపీలో చేరతా డని ఆమెతో చెప్పినట్లు ఆమే తనవాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు చూశాక, ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా అని ఎవరికైనాఅనిపించక మానదు. సొంత బాబాయ్ ని చంపిన వారిని శిక్షించలేని ముఖ్యమంత్రి, చివరకు తనచెల్లి న్యాయం కో సం అతన్ని ఆశ్రయిస్తే, హత్యచేసిన వారిని వెనకేసుకొచ్చేలా జగన్ రెడ్డి వ్యవహరించాడంటే అతని ప్రవర్తన ఎలాంటిదో అర్థమవుతోంది.

అన్నస్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి సునీతకు న్యాయం చేయ నందునే ఆమె చివరకు ఢిల్లీవీధుల్లో తిరిగారు. ఆకోవలోనే ఇప్పు డు లోక్ సభ స్పీకర్ కు లేఖరాశారు. తనతండ్రిది రాజకీయ హత్య అని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, తనకు, తన కుటుంబానికి న్యాయంజరగలేదని సునీత సీబీఐ ఎదుట మొరపె ట్టుకుంది. ఆమె వాంగ్మూలంచూశాక హత్యచేసిన వారిని కాపాడేప్రయత్నంచేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండటానికి అనర్హుడు.

తనపై 13కేసులున్నాయని, అవినాశ్ రెడ్డిపై 11కేసులున్నాయని కొన్నికేసులు నమోదైతే ఏమవుతుం దని జగన్మోహన్ రెడ్డిసునీతతో అన్నాడంటే అతని నేరప్రవృత్తి, అతని ఫ్యాక్షన్ మనస్తత్వం ఎలాంటివో ప్రత్యేకంగాచెప్పాల్సిన పని లేదు. వివేకానందరెడ్డి హత్యవ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాల్సిందే. పత్రికాముఖంగా ఆయన వాస్తవాలు బహిర్గతం చేయాలి.

తనబాబాయ్ ని చంపినవారిని అరెస్ట్ చేసి, న్యాయస్థా నం ముందునిలబెట్టాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సీబీఐకి చెప్పాలి. సొంతచిన్నాన్నను హత్యచేయించిన వారి 50 ఏళ్ల కుటుంబచరిత్ర మొత్తం రక్తచరిత్రే. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోఉన్నాడంటే ఎవరినైనా చంపడానికి వెనుకాడడని ప్రజలు గమనించాలని కోరుతున్నాం. బాబాయ్ హత్యపై గతంలో మొసలి కన్నీరుకార్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకడపజిల్లా ప్రజల కు, ముఖ్యంగా తననియోజకవర్గప్రజలకు ఏం సమాధానం చెబు తాడని తాము డిమాండ్ చేస్తున్నాం.

ఏదిఏమైనా వివేకానందరెడ్డి కుమార్తె సునీత రోడ్డెక్కి తనతండ్రిని చంపినవారికి శిక్షపడేలా చేయాలని వేడుకుంటున్నా, ఈ ముఖ్యమంత్రి మనసుకరగలేదం టే అతని మనస్తత్వం ఎంత క్రూరమైనదో ఏపీప్రజలంతా ఆలోచించాలని కోరుతున్నాం.

Leave a Reply