సంక్రాంతి సంబరాలకు
స్వస్తి చెప్పి
అనుబంధాలను,
ఆత్మీయతలను
సశేషంగా మిగిల్చి
హృదయం నిండా
వెలితి నింపుకొని
తిరుగు ప్రయాణంలో
అందరం…!
బతుకు పోరాటానికి
పునర్నిమగ్నం !
ఇష్టమున్నా లేకపోయినా
కష్టమైనా నష్టమైనా
జీవన గమనం అనివార్యం !
దూరాలను దగ్గర చేసి
భారాలనను దింపుడు చేసి
కేరింతలను కమనీయం చేసి
సరదాలను వేడుకగా చేసిన
పండుగలకు
కృతజ్ఞతలు!
జన్మభూమిని స్పృశించి
రక్తసంబంధీకుల్ని పలకరించి
మిత్ర బృందంతో పులకరించి
మధుర స్మృతులను
మూటను గట్టిన
సంక్రాంతికి ధన్యవాదాలు!
ఉత్తరాయణం నుండి
మరలా ఉత్తరాయణం కోసం
ప్రయాణం సాగిద్దాం !
నిరీక్షణలోనే
ఆనందం వెదుకుదాం !
– పి.లక్ష్మణ్ రావ్
అసిస్టెంట్ రిజిష్ట్రార్
సహకార శాఖ
విజయనగరం
9441215989