Suryaa.co.in

Telangana

రేవంత్ అది నోరా… మోరా?

– రైతు బంధు అపమని ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసింది నువ్వు కాదా ?
– నమ్మించి మోసం చేసింది ఎవరు ? ఎవరిని ఉరి తీయాలి ?
– 152 మీటర్ల హైట్ లో తమ్మిడీ హట్టి ప్రాజెక్ట్ కట్టకపోతే నిన్ను అదే తమ్మిడి హట్టి లో ఉరితీయాలా రేవంత్ రెడ్డి ?
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు అవినీతి జరిగితే 15 రిజర్వాయర్ లు మీ అయ్య కట్టిండా?
– మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: వరదను అయిన తట్టుకోవచ్చు కానీ ..రేవంత్ రెడ్డి నోటి నుండి వచ్చే అబద్దాలు బురదను మాత్రం భరించడం కష్టం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటులో ఉండి మూర్ఖంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఏం సాధించారు అని రైతు సంబరాలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ?

అసలు కేసీఆర్ రైతు బంధు లేక పోతే రైతు భరోసా ఎక్కడిది రేవంత్ రెడ్డి? 11 విడతలుగా రైతుల ఖాతాల్లోకి 80,000 కోట్ల కు పైగా రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించారు కేసీఆర్. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రైతుబందు ఎగ్గొట్టి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో 7500 కోట్లు చెల్లించింది అని అబద్ధం మాట్లాడాడు అది నోరా… మోరా నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా రేవంత్ రెడ్డి? ఆనాడు రైతు బంధు అపమని అక్టోబర్ 29 ,2023 న ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసింది నువ్వు కాదా ?

సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేలు ఇస్తానని చెప్పినవ్. పంటకు ఎకరాకు 7500 చొప్పున ప్రతి పంటకు 11,000 cr ఇవ్వాలి..4 పంటలకు 44000 కోట్లు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చింది – మొదటి సారి కేసీఆర్ ఉంచిన 7500 కోట్లు.

రెండవ సారి – జీరో. మూడవసారి – 3000 కోట్లు. ఇప్పుడు ఎలక్షన్ లు ఉన్నాయని 8500 కోట్లు. కేవలం అన్ని సీజన్ లు కలిపి 19000 కోట్లు ఇచ్చి రైతు భరోసా లో ఎగ్గొట్టింది 25000 కోట్లు.

25000 కోట్లు నీదా ఎగ్గొట్టే ధోరణి ?ఇచ్చిన మాటకు కరోనా సమయం లోనూ రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ దా ? స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం తో ఈ రైతు భరోసా వేశావ్ తప్ప రైతుల పై ప్రేమతొ కాదు . రాష్ట్రంలో రుణమాఫీ కి ఇవ్వాల్సింది 44000 కోట్లు అయితే ఇచ్చింది 20 వేల కోట్లు మాత్రమే. రుణమాఫీ లో ఎగ్గొట్టింది 25 వేల కోట్లు.

సన్నవడ్లకు బోనసిచ్చి కొంటామని హామీ ఇచ్చాము..ఇవ్వడమే కాదు 48 గంటల్లో డబ్బులు వేశాం అని మరో అబద్ధం ఆడాడు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట మార్చి సన్నాలకు ఇస్తామంటున్నారు. ఈ సీజన్ లో సేకరించిన సన్నాలకు 48 గంటల్లో బోనస్ వేశాం అంటున్నాడు రేవంత్ రెడ్డి 48 గంటలు కాదు 3 నెలలు అయిన బోనస్ రైతుల ఖాతాల్లో పడలేదు.

అసలు నువ్విచ్చిన మాట ప్రకారం అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తే.. 2024 రబీ – 45 లక్షల ఎకరాల్లో పండిన వరి పంటకు 6500 కోట్లు ఇవ్వాలి. 2024 ఖరీఫ్ – 65 లక్షల ఎకరాల్లో వరి పంటకు 8000 కోట్లు ఇవ్వాలి. 2025 రబీ – 45 లక్షల ఎకరాల్లో పండిన వరి పంటకు 6500 కోట్లు ఇవ్వాలి. మొత్తంగా 21,000 కోట్లు బోనస్ ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చింది ఒకే ఒకసారి 1000 కోట్లు మాత్రమే.

బోనస్ లో నువ్వు ఎగ్గొట్టింది 20,000 కోట్లు. అంటే కేవలం రైతు భరోసా 25000 కోట్లు. రుణమాఫీ 25000 కోట్లు. బోనస్ 25000 కోట్లు. సంవత్సరన్నర కాలం లోనే రైతులకు నువ్వు ఎగ్గొటింది 70,000 కోట్లు. నమ్మించి మోసం చేసింది ఎవరు ? ఎవరిని ఉరి తీయాలి ?

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అయ్యింది 1 లక్ష కోట్ల లోపు ..అందులో లక్ష కోట్లు అవినీతి జరిగితే 21 పంప్ హౌజ్ లు,19 సబ్ స్టేషన్ లు,203 కి.మీ టన్నెల్ లు,1531 కి.మీ కాలువలు,15 రిజర్వాయర్ లు మీ అయ్య కట్టిండా? మీరు అన్నట్టు 152 మీటర్ల హైట్ లో తమ్మిడీ హట్టి ప్రాజెక్ట్ కట్టకపోతే నిన్ను అదే తమ్మిడి హట్టి లో ఉరితీయాలా రేవంత్ రెడ్డి ?కేసీఆర్ రాక ముందు 10 లక్షలు ఉన్న ఎకరం కేసీఆర్ పరిపాలన వల్ల 30 లక్షలకు ఎకరం అయ్యింది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన రేవంత్ రెడ్డి శనీశ్వరుడు వల్ల 20 లక్షలకు కూడా ఆడిగినోడు దిక్కులేదు.

 

LEAVE A RESPONSE