Suryaa.co.in

Telangana

దావోస్ నుండి రేవంత్ ఒక చాక్లెట్ కంపెనీ కూడా తేలేదు

– రేవంత్ రెడ్డిని చూసి ఎవడు పెట్టుబడులు పెట్టరు
– దావోస్ మీటింగ్ లో చంద్రబాబు, ఫడ్నవిస్ డ్రెస్సింగ్ ఎలా ఉంది? రేవంత్ డ్రెస్సింగ్ ఎలా ఉంది?
– కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఎద్దేవా

హైదరాబాద్: కాంగ్రెస్ బహిష్కృత నేత, నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో సోషల్‌మీడియాలో నిలిచే బక్క జడ్సన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క చాక్లెట్ కంపెనీ కూడా రాలేదని, రేవంత్‌పై ఉన్న కేసులు చూసి పెట్టుబడులు వెనక్కివెళ్లారని, మేఘా లాంటి దొంగలను తీసుకువెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.
దళిత నేత బక్క జడ్సన్ ఇంకా ఏమన్నారంటే..రేవంత్ రెడ్డిని చూసి ఎవడు పెట్టుబడులు పెట్టరు. దావోస్‌కి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి, ఆయనపై 8 కేసులు ఉన్నాయి మేము పెట్టుబడులు పెట్టమని వెళ్లిపోతారు. ఆయనపై మేఘా కృష్ణారెడ్డి లాంటి దొంగలను తీసుకునివెళ్లి వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతా జూటా. హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. దాదాపు లక్ష అపార్ట్‌మెంట్లో ఉన్న ఫ్లాట్లు ఇవ్వాళ అమ్ముడు పోవడం లేదు.

పడిపోయిన రియల్ ఎస్టేట్ హైప్ లేపడానికి రూ. లక్షా 78 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు.రేవంత్ రెడ్డిని చూసి హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు.రేవంత్ రెడ్డి చైనాతో పోటీ పడతాడంట.. చైనా అధ్యక్షుడు కనీసం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు.

దావోస్ మీటింగ్ లో చంద్రబాబు డ్రెస్సింగ్ ఎలా ఉంది? ఫడ్నవిస్ డ్రెస్సింగ్ ఎలా ఉంది? మన ముఖ్యమంత్రి రేవంత్ డ్రెస్సింగ్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి దావోస్‌కు పెట్టుబడులు తేవడానికి పోయినట్టు లేదు.. లైటింగ్ కొట్టడానికి పోయినట్టు డ్రెస్సులు వేసాడు.

LEAVE A RESPONSE