– మళ్ళీ పథకాలను వాయిదా వేసే కుట్ర
– గాల్లో తిరుగుతూ గాలి నాయకులుగా మారారు
– సీఎం, మంత్రుల తీరుతో అధికారులు బలిపశువులు
– ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,బీ ఆర్ ఎస్ నేత వై .సతీష్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లనే మోసం చేశారు ..ప్రజలు ఆయనకు ఓ లెక్కా ? గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ,అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అని గ్రామ సభలు రుజువు చేస్తున్నాయి. గ్యారంటీల పై ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. ఎన్ని సార్లు బీ ఆర్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదు.
సీఎం మంత్రుల తీరుతో అధికారులు బలిపశువులు అవుతున్నారు. ఏ ఒక్క మంత్రి అయినా నిన్న గ్రామ సభల్లో పాల్గొని ప్రజల సమస్యలు విన్నారా ? ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు ..పాలనను గాలి కొదిలేశారు.
సీఎం మంత్రులు రాజభోగాల్లో మునిగి తేలుతున్నారు ..గాల్లో చక్కర్లు కొడుతున్నారు. గాల్లో తిరుగుతూ గాలి నాయకులుగా మారారు. గాల్లో తిరిగే వారికి గ్రౌండ్ రి యాలిటీస్ ఏం తెలుస్తాయి?
సీఎం విదేశాల్లో …మంత్రులు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇంత నీచమైన పాలన ఎపుడూ చూడలేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామ సభల్లో ఎవ్వరూ సరైన సమాధానం చెప్పడం లేదు. జనవరి 26 నుంచి అమలయ్యే నాలుగు పథకాలకు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని కొత్త లెక్కలు చెబుతున్నారు. మళ్ళీ పథకాలను వాయిదాను వేసే కుట్ర జరుగుతోంది. ఎన్ని సార్లు వాయిదాలు వేస్తారు ?
కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ లకు ఇందిరమ్మ ఇండ్లు అని నామకరణ చేస్తే బీ ఆర్ ఎస్ సహించదు. చేతనైతే కొత్తగా ఇండ్లు కట్టి వాటికి ఏ పేరైనా పెట్టుకోండి. ఇప్పటికే కట్టిన ఇండ్లను లబ్దిదారులకు మంజూరు చేయాలి.
గ్రేటర్ హైదరాబాద్ సమస్యల పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం లో చర్చించాం. కే టీ ఆర్ మాకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. 40 శాతం వీధి దీపాలు వెలగడం లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా మంత్రి వర్గం లో లేరు. లూటీ చేయడానికి తప్ప కాంగ్రెస్ నేతలు దేనికి పనికి రారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ సమస్యల పై ఉద్యమిస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు వర్తింప జేస్తామని అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.