– రేవంత్ రెడ్డి గద్దర్ కుమార్తెను మోసం చేశారు
– ఉప ఎన్నికల్లో వెన్నెలకు రేవంత్ రెడ్డి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు?
– దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు
– 4వేల కోట్లు కంటోన్మెంట్ కు రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చారు?
– రాజుగారి దేవత వస్త్రం కథలా రేవంత్ రెడ్డి
-రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధిని చూపిస్తే ముక్కు నేలకు రాస్తా
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు వేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కోడి కథ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలిసింది. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతున్నారు.
కంటోన్మెంట్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వేల కోట్లు ఎక్కడ? కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎలివేటెడ్ కారిడార్ ను కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది. బోర్డు మీటింగ్ కు మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఎస్.ఆర్.డి.పి లో భాగంగా అభివృద్ధి జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని నిధులు ఇచ్చారు?
రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ తో బిజీగా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో చర్చకు రెడీగా ఉన్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి పంపాలి. కంటోన్మెంట్ లో 6 వేల ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి? కంటోన్మెంట్ కు కేసీఆర్ వెయ్యి పడకల టిమ్స్ హాస్పిటల్ ఇచ్చారు. ఆసుపత్రి పనులు 85 శాతం పూర్తి అయ్యాయి. రేవంత్ రెడ్డికి రంగులు వేయడం చేతగావడం లేదు.
డిజిటల్ హెల్త్ కార్డులపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 50 లక్షలు ఇచ్చి పదికోట్లు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నారు. సెంటిమెంట్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతారా? కేసీఆర్ మాగంటి సునీతకు సాలిడారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గద్దర్ కుమార్తెను మోసం చేశారు.
ఉప ఎన్నికల్లో వెన్నెలకు రేవంత్ రెడ్డి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు? రేవంత్ రెడ్డికి,కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు ఎలాంటి లావాదేవీలు జరిగాయో తెలియదు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోరు
కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రక్షణ శాఖ భూములను బదలాయింపు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని మోసం చేశారు.
కేంద్ర రక్షణ శాఖామంత్రి వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి కంటోన్మెంట్ గురించి మాట్లాడారా?
కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. 25 వేలు ఇచ్చే పరిస్థితి లేదు 4వేల కోట్లు కంటోన్మెంట్ కు రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చారు? రేవంత్ రెడ్డి క ల లో 4వేల కోట్లు ఇచ్చారా? బస్తీ దవాఖానలను పట్టించుకోవడం లేదు.
కంటోన్మెంట్ అద్దంలా మారిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కలుపుతామని రేవంత్ రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం ఏమైంది? రాజుగారి దేవత వస్త్రం కథలా రేవంత్ రెడ్డి తీరు ఉంది. కంటోన్మెంట్ కు వచ్చి చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి చూపిస్తే ముక్కు నేలకు రాస్తాము. బిల్లా రంగాను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. రేవంత్ రెడ్డి ‘ బిల్లు రంగా ’ గా మారారు. బిల్లు వసూలు చేసి ఢిల్లీలో కడుతున్నారు.
సాయన్న అభివృద్ధి చేశారు: నివేదిత కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఇంచార్జ్
నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పధకాలు ఇవ్వమని సీఎం డైరెక్ట్ గా చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం రేవంత్ రెడ్డికి పట్టుకుంది. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే సాయన్న అభివృద్ధి చేశారు. కంటోన్మెంట్ ప్రతి గల్లీలో సాయన్న శిలాఫలకాలు ఉంటాయి.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో మా కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేసింది. జూబ్లీహిల్స్ లో మాగంటి సునితపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. మాగంటి సునితపై బురద చల్లుతున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఓడించాలి. మహిళలకు అవమానిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు వేస్తారా?