– రేవంత్‌రెడ్డి సమర్ధుడైన సీఎం
– వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణం మరియు మండలానికి సంబంధించిన 613 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ ను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్: దేశంలో పేదల కోసం కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే లక్ష్యంతో పనిచేశారు నాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం కూడా అదే ఆశయంతో పనిచేస్తుంది. అందుకే రాష్ట్రంలోని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నారు.
ఇళ్ళు మంజూరైన వాళ్ళు వెంటనే పనులను మొదలుపెట్టండి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మొత్తం నాలుగు విడతల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ అవుతాయి. బేస్ మెంట్ పూర్తైన తర్వాత లక్ష రూపాయిలు, గోడలు పూర్తైన తర్వాత 1.25 లక్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న తర్వాత 1.75 లక్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన తర్వాత మిగిలిన లక్ష రూపాయిలు వస్తాయి. ఈ ఏడాది నాలుగు లక్షల యాబై వేల ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో 22 వేల 500 కోట్లను కేటాయించారు. విడతల వారిగా రాష్ట్రంలోని పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి.
స్పీకర్ హోదాలో ఉండడంతో వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 7000 ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. మన నియోజకవర్గంలో కూడా స్వంత ఇల్లు లేని పేదలందరికి ఏడాదికి కొంతమందికి చొప్పున అందరికి ఇళ్ళను మంజూరు చేయిస్తాను. ఓట్లు వేసిన, వేయనోళ్ళు అనే బేధం లేకుండా రాజకీయాలకు అతీతంగా పేదలకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే అందిరికి ఒకేసారి ఇచ్చేవాళ్ళం.
కానీ గత ప్రభుత్వం చేసిన 8 లక్షల 20 వేల కోట్ల అప్పులకు మిత్తీలు, అసలు వాయిదాలు కట్టడానికే రాష్ట్ర బడ్జెట్లో సగం పోతుంది. ప్రజలు అర్ధం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు, అప్పులు తీర్చడంతో పాటుగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటుగా ఇవ్వని హామీలను కూడా ఇస్తున్నారు
పేదలు తృప్తిగా కడుపు నిండా అన్నం తినాలనే మంచి ఆశయంతో దేశంలోనే మొదటి సారిగా మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని రేషర్ షాపుల ద్వారా అందిస్తున్నారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలలో సన్న బియ్యం అన్నం తింటున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన గత 18 నెలల లోనే వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే 25 లక్షల మంది రైతులకు 22 వేల కోట్ల రుణమాఫీ చేసింది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు అందరు RTC బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే రాష్ట్రంలోని యాబై లక్షల పేదల కుటుంబాలకు గృహజ్వోతి పథకం ద్వారా ఉచితంగా కరంటు సరఫరా అవుతున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షల పెంచారు. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది. ఒక్క ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి వాతావరణం ఉండేది కాదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విదంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందుతాయి. ప్రతి గ్రామంలో 60 లక్షల నుండి కోటి రూపాయలతో సిసి రోడ్లను వేయించాను. అనంతగిరి ని పర్యాటకంగా వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ప్రాజెక్టుతో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి.