– ఆరు నెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసా ను ఆపే కుట్ర
– సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి ?
– ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు
80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ,మన్నె గోవర్ధన్ రెడ్డి ,తంగ బాలు
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. గ్రామసభల్లో ప్రజలు అధికారులను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానాలు లేవు. నా హుజురాబాద్ నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లకు 40 వేల మంది అర్హులని అధికారులు తేల్చారు. నామమాత్రపు పత్రాలు ఇచ్చి ప్రజలను అధికారులు మభ్యపెడుతున్నారు.
ఎవ్వరి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి ? ఈ పత్రాలు చూసి ఇళ్ళు కట్టుకుంటే ప్రజలు మోసపోతారు ..తస్మాత్ జాగ్రత్త. హుజురాబాద్ లో 40 వేల ఇండ్లకు పత్రాలు ఇస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఇండ్లకు పత్రాలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరూ మోసపోవద్దు ..ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు. జాగా లేని వారికి ఇండ్ల కేటాయింపులో స్పష్టత లేదు.
నా నియోజకవర్గం లో రైతు బంధు జాబితా లో నుంచి కేవలం 586 మంది నే తీసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క శాతం మందిని మాత్రమే రైతుబంధు జాబితా లో నుంచి తీసేశారు. 20 వేల కోట్ల రూపాయలను కేసీఆర్ రైతు బంధు రూపం లో దుర్వినియోగం చేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో కూడా ఆరోపించారు. రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన జాబితాకే రేవంత్ ఇస్తున్నారు. మరి ఇన్ని రోజులు 20 వేల కోట్ల రూపాయలు దుబారా అని అన్న దానికి రేవంత్ ఏం సమాధానం చెబుతారు ?
రేవంత్ ఓ తుగ్లక్ లా పాలిస్తున్నాడు. ఓ మూర్ఖుడి లా ప్రవర్తిస్తున్నాడు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది రేవంత్ తీరు. టకీ టకీ అని రైతు భరోసా డబ్బులు పడతాయని రేవంత్ అన్నాడు. ఒక్క రోజు డబ్బులు వేసి ఆపేశారు. ఆరు నెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసా ను ఆపే కుట్ర జరుగుతోంది.
కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. దాదాపు 90 వేల మంది ఈ వోటింగ్ లో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు.
సునీల్ పది మంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చడం లో సూత్రధారి ఆ కనుకోలే ఈ ఓటింగ్ పెట్టించి అభాసు పాలయ్యాడు. మరో చానల్ నిర్వహించిన సర్వేలో కూడా 80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. హుజురాబాద్ లో దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు బీ ఆర్ ఎస్ సాధించిన విజయం. అన్ని పథకాలు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్ గా మారాడు.