Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి అష్ట దరిద్రపు సీఎం

– మంచి సీఎం అంటే కేసీఆర్ ..దరిద్రపు సీఎం అంటే రేవంత్
– కొడంగల్ లో ప్రజలు తన్ని తరిమితేనే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి వెళ్ళారా ?
– నల్గొండ బాంబులు ,ఖమ్మం కత్తులు రేవంత్ మంత్రి వర్గం లోనే ఉన్నాయి
– నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన గ్రామాలలోనే కాంగ్రెస్ పోటీ చేయాలి
– మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, శుభప్రద్ పటేల్, పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు ,గతం లో కూడా మాట్లాడారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి వచ్చి మహబూబ్ నగర్ లో పోటీ చేశారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ కరీంనగర్ లో ఓడిపోతే మహబూబ్ నగర్ కి రాలేదు. రేవంత్ రెడ్డి కల్వకుర్తి నుంచి కొడంగల్ కు, కొడంగల్ నుంచి మల్కాజ్ గిరి వెళ్లలేదా ? కొడంగల్ లో ప్రజలు తన్ని తరిమితేనే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి వెళ్ళారా ? మహబూబ్ నగర్ నుంచి వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం.

రివర్స్ మైగ్రేషన్ కేసీఆర్ వల్లే సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమం పై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి యా నాటి ఉద్యమం గురించి మాట్లాడేది ? రేవంత్ రెడ్డి మాట ఎవరూ వినడం లేదు. తన కుర్చీ పై మంత్రులు కన్నేశారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఐ ఏ ఎస్ లు సరిగా పని చేయడం లేదని రేవంత్ రెడ్డే అంటున్నారు. రేవంత్ రెడ్డి లాంటి అష్ట దరిద్రపు సీఎం మరెవరూ లేరు. మంచి సీఎం అంటే కేసీఆర్ ..దరిద్రపు సీఎం అంటే రేవంత్. చర్చకు రమ్మని రేవంత్ సవాల్ విసురుతున్నారు.

చర్చ లో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా అంటున్నారు. రేవంత్ రెడ్డి ముక్కు మూతి పాడవకుండా చూసుకుంటే మంచిది. చర్చలో ఓడి పోవడం ఖాయం .రేవంత్ ముక్కు ఊడటం ఖాయం. ఉద్యోగాల కల్పనపై రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన చోట కాంగ్రెస్ పోటీ చేయాలి. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన చోట బీ ఆర్ ఎస్ పోటీ చేయాలి అని రేవంత్ అంటున్నారు.
ఎన్నికలప్పుడు ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతా అని రేవంత్ ఎన్నికలప్పుడు చెప్పారు. నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన గ్రామాలలోనే కాంగ్రెస్ పోటీ చేయాలి. రైతు రుణమాఫీ వంద శాతం అయిన గ్రామాల్లోనే కాంగ్రెస్ పోటీ చేయాలి. రైతు భరోసా ఇచ్చిన గ్రామాల్లోనే కాంగ్రెస్ పోటీ చేయాలి. కల్యాణ లక్ష్మి వచ్చిన చోట బీ ఆర్ ఎస్ పోటీ చేస్తుంది .తులం బంగారం ఇచ్చిన చోట కాంగ్రెస్ పోటీ చేయాలి.

బీ ఆర్ ఎస్ నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారని రేవంత్ అంటున్నారు. నల్గొండ బాంబులు ,ఖమ్మం కత్తులు రేవంత్ మంత్రి వర్గం లోనే ఉన్నాయి .ముందు వాళ్ళ నుంచి కాపాడుకో. పనిలో నిమగ్నం అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పడం శుద్ధ అబద్ధం. అవినీతి సంపాదన లో రేవంత్ నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రాదనీ తెలిసే రేవంత్ రాకరాక తనకు సీఎం గా అవకాశం వచ్చిందని అంటున్నారు. హామీల అమలుకు ఐదేండ్ల దాకా టైమ్ ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాంటపుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు అన్నారు ?ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

చరిత్ర రేవంత్ మారిస్తే మారదు: పల్లె రవికుమార్

పోతిరెడ్డి పాడు విషయం లో రేవంత్ రెడ్డి సీఎం పదవి లో ఉండి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. చరిత్ర రేవంత్ మారిస్తే మారదు. పోతిరెడ్డి పాడును వ్యతిరేకిస్తూ వై ఎస్ మంత్రి వర్గం నుంచి టీ ఆర్ ఎస్ బయటకు వస్తే కాంగ్రెస్ నేతలు పదవులు పట్టుకుని వేలాడారు.

రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు మాని తెలంగాణ కు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకు ప్రయత్నించాలి. నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడేసిన ఘనత కాంగ్రెస్ దే. కేసీఆర్ ను విమర్శించే అర్హత రేవంత్ కు లేదు. బీసీ కుల గణన పై రేవంత్ రెడ్డి మొండి వాదనలు చేస్తున్నారు. కులగణన లోపాలపై శాస్త్రీయ ఆధారాలతో మేము మాట్లాడుతుంటే రేవంత్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఏ రకంగా చూసినా రాష్ట్ర జనాభా 4 కోట్ల 30 లక్షలు దాటుతుంది. తక్కువ జనసంఖ్య చూపిన సర్వే తప్పు కాకుండా ఒప్పు అవుతుందా?

LEAVE A RESPONSE